Begin typing your search above and press return to search.
మిలియన్ డాలర్ క్లబ్‌లో 'ఆ నలుగురు'
By: Tupaki Desk | 14 April 2015 11:25 AM GMTస్వేదేశంలో బాక్సాఫీస్‌ని ఊపేస్తే సరిపోదు... విదేశం నుంచి సరైన వసూళ్లు తెస్తేనే మగతనం. అందునా అమెరికా, గల్ఫ్ సహా విదేశాలలో 1 మిలియన్ డాలర్ (10లక్షల డాలర్లు) క్లబ్‌లో చేరితేనే రేంజు పెంచుకున్నట్టు. ఇంతకాలం విదేశీ వాణిజ్యంలో 1 మిలియన్ క్లబ్‌లో చేరిన పేర్లు మూడే మూడు.
మహేష్, పవన్‌కల్యాణ్, ఎన్టీఆర్ మాత్రమే ఆ ఫీట్ సాధించారు. దూకుడుతో మహేష్ తొలిసారి ఆ ఫీట్ సాధించాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆగడు, 1నేనొక్కడినే సినిమాలతో సేమ్ రిపీట్ చేశాడు. అతడు నటించిన నాలుగు సినిమాలు ఇప్పటికే 1మిలియన్ క్లబ్‌లో చేరాయి. ఆ తర్వాతి స్థానంలో గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది, చిత్రాలతో పవన్ రెండో స్థానంలో ఉన్నాడు. తర్వాత బాద్‌షా, టెంపర్ సినిమాలతో ఎన్టీఆర్ ఆ ఫీట్‌ని సాధించాడు. ఇప్పుడు నాలుగో వాడిగా బన్ని ఆ స్థానంలో చేరాడు. రేసుగుర్రం చిత్రంతో విదేశీ బాక్సాఫీస్ వద్ద మిలియన్ డాలర్ వసూళ్లు సాధించిన బన్ని ఇప్పుడు 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాతో ఆ ఫీట్‌ని రిపీట్ చేశాడు.
తొలివారమే అక్కడ బాక్సాఫీస్ వద్ద 1మిలియన్ డాలర్ క్లబ్‌లో చేరాడు. మహేష్ తొలి స్థానంలో నిలిస్తే.. పవన్, ఎన్టీఆర్, బన్ని.. విదేశీ బాక్సాఫీస్ వద్ద రెండో స్థానాన్ని షేర్ చేసుకున్నారు. వీళ్ళే 'ఆ నలుగురు'