Begin typing your search above and press return to search.
ప్రభుత్వ ఆఫర్ పట్టించుకోని 'గాడ్ ఫాదర్', 'దిఘోస్ట్'
By: Tupaki Desk | 1 Oct 2022 4:48 AM GMTమెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా మరియు నాగార్జున నటించిన ది ఘోస్ట్ సినిమాలు దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాల నిర్మాతలు మరియు బయ్యర్లు అభిమానులకు మరియు సామాన్య ప్రేక్షకులకు చాలా పెద్ద గుడ్ న్యూస్ చెప్పి నెత్తిన నీళ్లు పోసినంత పని చేశారు.
ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలు పెద్ద సినిమాలకు మొదటి వారం పది రోజులు తమ ఇష్టానుసారంగా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఓకే చెప్పింది. ప్రభుత్వాలు ఇచ్చిన ఈ ఆఫర్ ను కొన్ని సినిమాలు ఉపయోగించుకుని లాభం పొందాయి. కానీ ఎక్కువ శాతం సినిమాలు మాత్రం ఈ ఆఫర్ ని వద్దు బాబోయ్ అంటున్నారు.
మొదటి వారం పది రోజులు టికెట్ల రేట్లు పెంచడం వల్ల థియేటర్లకు జనాలు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా అంత మొత్తంలో టికెట్ల రేట్లు పెట్టలేక సామాన్యుడు అనేవాడు సినిమా మొహం చూడకుండానే మొహం చాటేస్తున్నాడు. అందుకే టికెట్ల రేట్లు ఇప్పటికే ఎక్కువ ఉన్నాయి.. ఇంకా పెంచాలని అనుకోవడం లేదని చాలా మంది భావించి తమ సినిమాలను విడుదల చేశారు.
దసరాకు రాబోతున్న గాడ్ ఫాదర్ మరియు ది ఘోస్ట్ సినిమాలకు కూడా టికెట్ల రేట్లను పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వాలు ఇచ్చాయి. రూల్ ప్రకారం ఆ రెండు సినిమాలు కూడా టికెట్ల రేట్ల పెంపుకు అర్హత ఉన్న సినిమాలే.. కానీ టికెట్ల రేట్లను పెంచకుండా నార్మల్ రేట్లకే ప్రేక్షకులకు అందుబాటులో ఉంచబోతున్నట్లుగా తెలుస్తోంది.
మొదటి రోజు కాస్త రేట్లు ఎక్కువ ఉన్నా ఆ తర్వాత రోజు నుండి చిన్న సినిమాలకు ఎలాంటి టికెట్ల రేట్లు ఉంటాయో గాడ్ ఫాదర్.. ది ఘోస్ట్ కి కూడా అవే రేట్లు ఉంటాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఇది చాలా మంచి పరిణామం అంటూ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ రేట్లు ఉండటం వల్ల దసరా పండుగ సెలవులకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.