Begin typing your search above and press return to search.

నా భార్యతో మస్తు గొడవలున్నాయ్!

By:  Tupaki Desk   |   7 Aug 2019 7:41 AM GMT
నా భార్యతో మస్తు గొడవలున్నాయ్!
X
కుంకుమపువ్వు ఫేం మధు ప్రకాష్ సతీమణి భారతి సూసైడ్ చేసుకున్న వైనం సంచలనంగా మారింది. ఆమె ఆత్మహత్యకు కారణంగా భర్త వేధింపులే కారణం అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారతి తల్లిదండ్రులు మధు తీరును తప్పు పడుతూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఆమెకు వేరే నటితో సంబంధాలు ఉన్నాయని.. గత ఏడాదిగా తన కుమార్తెను నిర్లక్ష్యం చేసినట్లుగా ఆమె పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.

ఈ ఆరోపణల్ని ఖండిస్తున్నారు మధు. భార్య ఆత్మహత్య అంశంపై మధు ప్రకాష్ వాదన మరోలా ఉంది. భారతి కుటుంబ సభ్యుల వాదనలకు భిన్నమైన వాదనను అతను వినిపిస్తున్నాడు కుంకుమపువ్వు సీరియల్ లో కథానాయకుడిగా.. బాహుబలి చిత్రంతో పాటు పలు చిత్రాల్లో నటించిన మధు సుపరిచితుడు.

తన భార్యకు.. తనకు మధ్య గొడవలు ఉన్నాయని.. గతంలో కూడా తాను సూసైడ్ చేసుకుంటానని తరచూ బెదిరించేదన్నారు. రెండు రోజుల క్రితమే తన భార్యతో తనకు గొడవలు అయ్యాయని.. ప్రతి చిన్న విషయానికి గొడవ పడేదన్నారు.

గతంలోనూ సూసైడ్ చేసుకుంటానని బెదిరించేదని.. ఇందులో భాగంగా ఫోన్ కు మెసేజ్ లు పంపేదన్నారు. సీరియల్స్ లో నటించటం ఇష్టం లేదని చెప్పారు. గొడవల కారణంగా కొంత కాలం క్రితం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా చెప్పారు

మరోవైపు భారతి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. సీరియల్ లో నటిస్తున్న మరో మహిళతో మధుకు వివాహేతర సంబంధం ఉందని.. ఆమె పరిచయంతోనే తన కుమార్తెను నిర్లక్ష్యం చేశారని మండిపడుతున్నారు. తన కుమార్తెను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నట్లుగా ఆరోపించారు. రెండేళ్లుగా తమ కుమార్తెపైన మధు వేధింపులకు పాల్పడుతున్నాడని.. చాలాసార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లుగా భారతి తల్లిదండ్రుల చెబుతున్నారు. తన కుమార్తెను రూ.15లక్షలు కట్నం ఇచ్చి ఘనంగా పెళ్లి చేశామని.. మధును కఠినంగా శిక్షించాలన్నారు. ఇలా మధు మాటలు ఒకలా.. భారతి తల్లిదండ్రుల మాటలు మరోలా ఉన్నాయి. ఇందులో ఎవరి వాదన నిజమన్నది పోలీసుల విచారణలో తేలనుంది.