Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ తో తెలుగు యువ దర్శకుడి సాహసం..!

By:  Tupaki Desk   |   13 Dec 2022 10:30 AM GMT
సూపర్ స్టార్ తో తెలుగు యువ దర్శకుడి సాహసం..!
X
తొలి సినిమానే దర్శకుడిగా టాలెంట్ చూపిస్తే ఆ డైరెక్టర్ కి ఉండే రెస్పెక్ట్ వేరేలా ఉంటుంది. మైండ్ లో ఎంత గొప్ప కథ ఉన్నా సరే దాన్ని తెర మీద ఎగ్జిక్యూట్ చేయడంలోనే డైరెక్టర్ టాలెంట్ ఉంటుంది. అదే డైరెక్టర్ సక్సెస్ రేట్ ని డిసైడ్ చేస్తుంది. ఈమధ్య కాలంలో అలానే మొదటి సినిమాతోనే సత్తా చాటిన డైరెక్టర్ ఎవరంటే వశిష్ట అని చెప్పొచ్చు. నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార లాంటి కథతో సూపర్ హిట్ అందుకున్నాడు వశిష్ట. కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఆ సినిమా.

సినిమా సక్సెస్ అవగానే సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి కూడా పిలుపు అందుకున్నాడు బింబిసార డైరెక్టర్. రజనీ కోసం కూడా ఒక అద్భుతమైన కథ అనుకున్నాడట వశిష్ట. అది చెప్పేందుకే ఆయన్ని కలిశారని టాక్. కథ విన్న రజిని ప్లాన్ చేద్దాం అన్నట్టు తెలుస్తుంది.

ఇక లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా రజిని కాంత్ తో తను దిగిన ఫోటోని షేర్ చేశాడు వశిష్ట. సినిమా కన్ఫర్మ్ అయిందని ఆ ఫోటో పెట్టాడా లేక జస్ట్ విషెస్ కోసం పెట్టాడా అన్నది తెలియదు కానీ రజినీకాంత్ సినిమా గురించి వశిష్ఠ చాలా హోప్స్ తో ఉన్నట్టు తెలుస్తుంది.

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర సందడి చేయట్లేదు. ఆయన సినిమా సూపర్ హిట్ కొట్టి చాలా రోజులైంది. అందుకే వశిష్ట రజినీ కోసం ఓ కథ రాసుకున్నాడట. మరి తెలుగు యువ దర్శకుడి కథని సూపర్ స్టార్ ఓకే చేస్తారా లేదా అన్నది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ డైరెక్షన్ లో జైలర్ సినిమా చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే సందర్భంగా రజినీకాంత్ జైలర్ నుంచి టీజర్ రిలీజైంది.

సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కూడా రజినీ మాస్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరి జైలర్ తో అయినా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీరుతుందా లేదా అన్నది చూడాలి. జైలర్ సినిమా తర్వాత రజినీ ఎవరితో సినిమా చేస్తున్నారు అన్నది క్లారిటీ రాలేదు. వశిష్ట కూడా బాలకృష్ణతో ఒక సినిమా.. బింబిసార 2 తో పాటుగా గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా ఉందని తెలుస్తుంది. మొత్తానికి బింబిసారతో వశిష్ట బిజీ డైరెక్టర్ గా మారాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.