Begin typing your search above and press return to search.

తెలుసా తెలుసా! తూర్పు ప‌డ‌మ‌ర‌ల చిట‌ప‌ట‌లు ఏంటో..!

By:  Tupaki Desk   |   3 Feb 2022 2:32 PM GMT
తెలుసా తెలుసా! తూర్పు ప‌డ‌మ‌ర‌ల చిట‌ప‌ట‌లు ఏంటో..!
X
వైద్య వృత్తిలో ప్ర‌వేశించాలనుకునే మెడికోల ప్రేమ‌ క‌థ‌ల‌తో ఇప్ప‌టికే బోలెడ‌న్ని సినిమాలొచ్చాయి. ఇంత‌కుముందు అర్జున్ రెడ్డిలో నాయ‌కానాయిక‌లు మెడికోలు. కానీ అందుకు భిన్న‌మైన సినిమాని ఈసారి చూపించాల్సి ఉంటుంది. వైష్ణ‌వ్ తేజ్ ప్రస్తుతం అలాంటి ప్ర‌య‌త్నంలోనే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. మెడలో స్నెత‌స్కోప్ ప‌క్క‌నే క‌వ్వించే అమ్మాయి.. అత‌డి చూపు ఎటో ఇట్టే తెలిసిపోతోంది.

వైష్ణవ్ తేజ్ న‌టిస్తున్న‌ మూడో సినిమాగా `రంగరంగ వైభవంగా` తెర‌కెక్కుతోంది. గిరీశ‌య్య‌ దర్శకత్వంలో బీవీఎస్ ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కేతిక శర్మ ఇందులో క‌థానాయిక‌. ఇది క్యాంపస్ ల‌వ్ స్టోరి అని పోస్ట‌ర్లు విజువ‌ల్స్ చూడ‌గానే అర్థ‌మ‌వుతోంది.

ఇక కేతిక‌తో వైష్ణ‌వ్ రొమాన్స్ ఒక రేంజులో వ‌ర్క‌వుట‌వుతోంద‌ని తాజాగా విడుద‌ల చేసిన తెలుసా తెలుసా సాంగ్ తో ప్రూవ్ అవుతోంది. ఇక సాంగ్ ఆద్యంతం యువ‌జంట న‌డుమ దూరం దూరం క‌నిపిస్తున్నా.. ఆక‌ర్ష‌ణ రొమాన్స్ కి సంబంధించిన ఏవో ఫీలింగ్స్ క‌నిపిస్తున్నాయి. తూర్పు ప‌డ‌మ‌ర‌ల్లా క‌ల‌వ‌క‌పోయినా కానీ.. ఆ ఇద్ద‌రూ ప‌రిస‌రాల్లోకి వ‌స్తే ల‌వ్ వైబ్స్ మాత్రం పుట్టుకొస్తున్నాయి. కుర్ర జంట కిరాక్ పుట్టించేస్తోంది. ఇంత‌కీ ఆ ఇద్ద‌రి న‌డుమా ఎవ్వ‌రు చ‌ద‌వ‌ని క‌థ‌నం ఏం ఉందో చూడాలి. ప్లెయిన్ ఫార్మ‌ల్ లుక్ లో వైష్ణ‌వ్ ఎంతో స్టైలిష్ గా క‌నిపిస్తుండ‌గా.. ఫార్మల్ పంజాబీలో సింపుల్ గాళ్ గా కేతిక క‌నిపిస్తోంది. ఆ ఇద్ద‌రు స‌రిజోడు అనేందుకు ఈ ఒక్క ఫోటోగ్రాఫ్ చాలు. తొలిగా కృతి శెట్టి లాంటి అంద‌గ‌త్తెతో రొమాన్స్ చేసిన అత‌డు ఆ త‌ర్వాత త‌న కంటే సీనియ‌ర్ అయిన ర‌కుల్ తో రొమాన్స్ పండించాడు. ఇప్పుడు యంగ్ బాంబ‌ర్ కేతిక‌తో రొమాన్స్ ని మ‌రో లెవ‌ల్లో ర‌క్తి క‌ట్టించ‌నున్నాడు. అయితే కేతిక ఈ సినిమాలో ఒక మెడికో పాత్ర‌కు త‌గ్గ‌ట్టు ఎంతో డీసెంట్ గా క‌నిపిస్తోంది.

దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో పాట‌కు శ్రీమణి సాహిత్యాన్ని అందించ‌గా.. శంకర్ మహదేవన్ ఆలపించారు. బాణీ ఎంతో మీనింగ్ ఫుల్ గా ఉంది. యువ‌త‌రంలోకి వైర‌ల్ గా దూసుకెళుతోంది.

ఈ సాంగ్ ను బట్టి హీరో హీరోయిన్ల మధ్య హై స్కూల్ రోజుల నుంచే లవ్ మొదలవుతుందనే విషయం అర్థమవుతోంది. మెడికల్ కాలేజ్ లో స్టూడెంట్స్ గా ఉన్నప్పటికీ వాళ్ల మధ్య అదే ప్రేమ కొనసాగుతున్నట్టుగా చూపించారు. విజయ్ బిన్ని కొరియోగ్రఫీని అందించాడు. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.