Begin typing your search above and press return to search.

ఇప్పుడీ డబ్బింగ్ అవసరమా విశాల్

By:  Tupaki Desk   |   25 May 2019 6:42 AM GMT
ఇప్పుడీ డబ్బింగ్ అవసరమా విశాల్
X
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచిపోయిన టెంపర్ ని అభిమానులు చాలా స్పెషల్ గా ఫీలవుతారు. పూరి మార్కు టేకింగ్ తో పాటు తారక్ టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకునేలా చేసింది. గత ఏడాది రన్బీర్ సింగ్ ఎంతో ముచ్చటపడి మరీ సింబా పేరుతో రీమేక్ చేసి వంద కోట్లు రాబట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇటీవలే తమిళ్ లో విశాల్ హీరోగా ఇది అయోగ్య పేరుతో విడుదలైంది. ఇక్కడ కాజల్ అగర్వాల్ చేసిన పాత్రను రాశి ఖన్నా ప్రకాష్ రాజ్ రోల్ ని పార్తీబన్ చేయగా పోసాని పాత్రలో జైసింహ దర్శకుడు కేఎస్ రవికుమార్ కనిపిస్తారు. అక్కడ మంచి సక్సెస్ అందుకున్న అయోగ్య విశాల్ కెరీర్ బెస్ట్ నిలిచే దిశగా వసూళ్లు రాబట్టింది. తాజా ట్విస్ట్ ఏంటంటే ఇది తెలుగులోకి డబ్ చేస్తారట

ఎందుకయ్యా అంటే తమిళ టెంపర్ చివరి అరగంటలో కీలక మార్పులు చేశారు. డ్రామా తగ్గించేసి ఫైట్ లేకుండా హీరో పాత్రకు ఊహించని క్లైమాక్స్ ని సెట్ చేశారు. నిజానికి ఇదే అక్కడ బాగా వర్క్ అవుట్ అయ్యింది. అందుకే ఈ తేడాను మనవాళ్ళు కూడా ఆస్వాదించాలని మల్కాపురం శివకుమార్ దీని హక్కులను కొన్నట్టుగా తెలిసింది.

అయోగ్యకు ముందే దీన్ని తెలుగులో డబ్ చేయమని విశాల్ చెప్పాడు. కానీ ఇప్పుడు జరుగుతోంది వేరు. ఎంత అరగంట సినిమా మార్చినా మిగిలిన రెండు గంటలు మక్కికి మక్కి ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడీ తమిళ టెంపర్ ని తెలుగులోకి తీసుకురావడం ఎంత వరకు కరెక్టో వచ్చాక కానీ అర్థం కాదు. విశాల్ దీని గురించి ఇంకా ఏమి ట్వీట్ చేయలేదు. అభిమన్యుడు-పందెం కోడి 2లతో గత ఏడాది రెండుసార్లు పలకరించిన విశాల్ ఈ సంవత్సరం అయోగ్యతోనే దర్శనమిచ్చేలా ఉన్నాడు