Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: విశాల్ టెంపర్ ఇలా ఉంది!
By: Tupaki Desk | 6 Feb 2019 4:56 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లో 'టెంపర్' ఒక మెమొరబుల్ ఫిలిం. ఎందుకంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ కెరీర్ బెస్ట్ అని ఇప్పటికీ చాలామంది అభిప్రాయం. మరి ఇలాంటి సినిమా ను ఇతర భాషలలో రీమేక్ చేసినప్పుడు పోలికలు.. విమర్శలు తప్పవు. ఆల్రెడీ ఈ సినిమాను హిందీ లో 'సింబా' పేరుతో రీమేక్ చేశారు. రోహిత్ శెట్టి హిందీలో కొన్ని మార్పుచేర్పులు చేశాడు. తెలుగు ఆడియన్స్ ఆ సినిమాపై పెదవి విరిచినా ఆ సినిమా హిందీలో సూపర్ హిట్ అయింది.
ఇప్పుడు 'టెంపర్' తమిళ రీమేక్ వంతు. 'టెంపర్' ను తమిళంలో 'అయోగ్య' టైటిల్ తో విశాల్ హీరోగా తెరకెక్కించారు. ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితం రిలీజ్ అయింది. టీజర్లో సీన్స్ చాలావరకూ తెలుగు వెర్షన్ నుంచి కాపీ పేస్ట్ చేసినట్టే ఉన్నాయి. తెలుగులో వైఫై డైలాగ్ వచ్చినప్పుడు ఫైట్ సీన్.. బీచ్ లో మరో ఫైట్ సీన్ ఇలా దాదాపు మెజారిటీ సీన్స్ ను మార్చకుండా వాడుకున్నారు. విశాల్ వరకూ చూస్తే ఓకే కానీ ఎన్టీఆర్ తో పోలిస్తే మాత్రం తేలిపోయాడు. ముఖ్యంగా బీచ్ ఫైట్ లో హాకీ స్టిక్ షాట్(తమిళం లో ఇనప రాడ్ పెట్టారు) లో రక్తం కారుతున్నప్పుడు వెకిలిగా నవ్వే సమయంలో అది క్లియర్ గా తెలుస్తుంది.
'టెంపర్' తో పోలికలు పక్కన బెడితే ఒకరకంగా 'సింబా' కంటే 'అయోగ్య' బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే రీమేక్ ను చెడగొట్టినట్టు మాత్రం అనిపించడం లేదు. 'అయోగ్య' లో ప్రకాష్ రాజ్ పాత్రలో పార్తిబన్ నటించాడు. రాశి ఖన్నా ఈ సినిమాలో హీరోయిన్. వెంకట్ మోహన్ ఈ సినిమాకు దర్శకుడు. సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంతలోపు మీరు ఒకసారి 'అయోగ్య' టీజర్ పై లుక్కేయండి.