Begin typing your search above and press return to search.

ఈ వారం ప‌ది రిలీజ్ లు.. కానీ..!

By:  Tupaki Desk   |   6 Nov 2022 2:30 AM GMT
ఈ వారం ప‌ది రిలీజ్ లు.. కానీ..!
X
ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి మొత్తం ప‌ది సినిమాలొచ్చాయి. అల్లు శిరీష్, అను ఇమ్యాన్యుయేల్ జంట‌గా న‌టించిన `ఊర్వ‌శీవో రాక్ష‌సివో`, సంతోష్ శోభ‌న్‌, ఫ‌రియా అబ్దుల్లా `లైక్ అండ్ షేర్ స‌బ్క్రైబ్‌`, న‌వీన్ చంద్ర `త‌గ్గేదేలే`, క‌న్న‌డ డ‌బ్బింగ్ సినిమా `బ‌నార‌స్‌`, అశోక్ సెల్వ‌న్ న‌టించిన త‌మిళ చిత్రం `ఆకాశం`, నందు, ర‌ష్మీ గౌత‌మ్ జంటగా న‌టించిన `బొమ్మ బ్లాక్ బ‌స్ట‌ర్`తో పాటు ప‌లు సినిమాలు విడుద‌ల‌య్యాయి. అందులో అల్లు శిరీష్, అను ఇమ్యాన్యుయేల్ జంట‌గా న‌టించిన `ఊర్వ‌శీవో రాక్ష‌సివో` మెరుగైన ఓపెనింగ్స్ ని రాబ‌ట్టి ముందు వ‌రుస‌లో నిలిచింది.

మిగ‌తా సినిమాల‌తో పోలిస్తే మంచి వ‌సూళ్లని రాబడుతూ ఆక‌ట్టుకుంటోంది. టీజ‌ర్‌, ట్రైల‌ర్ ల‌తో యూత్ ని ఎట్రాక్ట్ చేసిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో వ‌సూళ్ళ‌ని రాబ‌ట్ట‌లేక‌పోయినా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వ‌సూళ్ల ప‌రంగా ఫ‌ర‌వాలేద‌నిపించే ఫిగ‌ర్ ల‌నే కాబ‌ట్టింది. తొలి రోజు ఓపెనింగ్స్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 40 నుంచి 45 ల‌క్ష‌ల షేర్ ని రాబ‌ట్టింది. సినిమా నేప‌థ్యం, అడ‌ల్ట్ కంటెంట్‌, ఇంట‌మ‌సీ సీన్స్‌.. ఊహించ‌ని స్థాయిలో అల్లు శిరీష్, అను ఇమ్యాన్యుయేల్ ల కెమిస్ట్రీ.. లిప్ లాక్స్ సినిమాని యూత్ కు ద‌గ్గ‌ర చేశాయి.

శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ వీకెంట్ లో మౌత్ టాక్ ని బ‌ట్టి టికెట్ విండోలో మ‌రింత‌గా వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. శుక్ర‌వారం విడుద‌లైన ప‌ది సినిమాల్లో ఏ సినిమాకు లేని టాక్ ఈ సినిమాకే వుండ‌టంతో వ‌సూళ్లు కూడా శని, ఆదావారాలు మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం వుంది అని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. సినిమా టాక్ పాజిటివ్ గా వుండ‌టంతో దీన్ని గీతా ఆర్ట్స్ వ‌ర్గాలు సూప‌ర్ హిట్ గా మ‌ల‌చ‌డం కోసం ప్ర‌మోష‌న్స్ ని ఏ రేంజ్ లో హోరెత్తించ‌బోతున్నారో వేచి చూడాల్సిందే.

వారి ప్ర‌చార స‌ర‌ళికి అనుగుణంగానే ఈ మూవీ వ‌సూళ్లు పెరిగే అవ‌కాశం వుంది. ఇక సంతోష్ శోభ‌న్‌, ఫ‌రియా అబ్దుల్లా న‌టించిన `లైక్ అండ్ షేర్ స‌బ్క్రైబ్‌` యావ‌రేజ్ టాక్ ని సొంతం చేసుకున్నా మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌లో దీనికి ఆద‌ర‌ణ ల‌భిస్తున్నా.. సింగిల్ స్క్రీన్ ల‌లో మాత్రం ఆ స్థాయిలో ఆద‌ర‌ణ ఈ సినిమా రాబ‌ట్ట‌లేక‌పోతోంది. దీంతో ఇప్ప‌టికీ క‌న్న‌డ సినిమా `కాంతార‌` త‌న ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తూనే వుంది. మూడు వారాలు పూర్త‌యినా ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో 46 కోట్ల గ్రాస్ ని వ‌సూలు చేసి తెలుగులో ఆల్ టైమ్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిల‌వ‌డం రికార్డుగా చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.