Begin typing your search above and press return to search.

స్మైల్ తో కొల్ల‌గొడుతోన్న తెనాలి అందం!

By:  Tupaki Desk   |   11 Nov 2021 2:30 AM GMT
స్మైల్ తో కొల్ల‌గొడుతోన్న తెనాలి అందం!
X
తెనాలి బ్యూటీ శోభిత దూళిపాళ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్.. కోలీవుడ్ లో నిల‌దొక్కుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. కెరీర్ ఆరంభంలో బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన బ్యూటీ సౌత్ రెండు భాష‌ల‌పైనా ఫోక‌స్ పెట్టి ప‌నిచేస్తోంది. ఇంత‌కుముందు గూఢ‌చారి చిత్రంతో తెలుగులో అడుగుపెట్టింది. ఆరంగేట్ర‌మే అద‌ర‌గొట్టింది. ఇప్పుడు మ‌రోసారి అడవి శేషు హీరోగా న‌టిస్తోన్న `మేజ‌ర్` చిత్రంలో న‌టిస్తోంది. మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతోంది. ఈ సినిమా తెలుగు..ఇంగ్లీష్ భాష‌ల్లో తెర‌కెక్కుతోంది. శ‌శికిర‌ణ్ తిక్క ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ హీరోగా న‌టించ‌నున్న‌ 22వ చిత్రంలోనూ అమ్మ‌డు ఎంపికైంది. అటు కోలీవుడ్ లోనూ రెండు సినిమాలు చేస్తోంది.

ఇలా శోభిత కెరీర్ ప‌రంగా మంచి అవ‌కాశాలు అందుకుంటోంది. ఇక ఈ బ్యూటీ గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇన్ స్టా వేదిక‌గా నిరంత‌ర ఫోటోషూట్లతో వేడెక్కించ‌డం అమ్మ‌డిలో మ‌రో ప్ర‌త్యేక‌త‌. తాజాగా శోభిత‌ ట్రెడిష‌న‌ల్ దుస్తుల్లో క్యూట్ స్మైల్ తో ఆక‌ట్టుకుంటోంది. లాక్ నెక్ డిజైన‌ర్ బ్లౌజ్.. బెడ్ డాడ్జ్ చీర‌లో..పొడ‌వాటి చెవి రింగులు.. మెడ‌లో సింపుల్ నెక్ల‌స్ తో త‌ళుక్కున మెరిసింది. మ‌ల‌యాళ సినిమా `కురుప్` ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇలా అందంగా ముస్తాబై హాజ‌రైంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది.

`కురుప్` లో దుల్కార్ స‌ల్మాన్..ఇంద్ర‌జీత్ సుకుమార్ హీరోలుగా న‌టిస్తున్నారు. శ్రీనాధ్ రాజేంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌క్షిణాదిన అన్ని భాష‌ల్లోనూ ఈ చిత్రం తెర‌కెక్కింది. సినిమాపై అంచానాలు బాగున్నాయి. స‌క్సెస్ పైనా శోభిత కాన్ఫిడెంట్ గా ఉంది. శోభిత తెలుగులో `గుఢ‌చారి` సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమాలో ఛాలెజింగ్ రోల్ పోషించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంది. క‌మ‌ర్శియ‌ల్ గానూ సినిమా పెద్ద స‌క్సెస్ అయింది. దీంతో అవ‌కాశాల‌కు ఆ సినిమా స‌క్సెస్ దొహ‌ద‌ప‌డింది. ఇప్ప‌టికి బిజీ నాయిక‌గా కెరీర్ ప‌రంగా జోష్ తో ఉంది.