Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ : టెర్రర్
By: Tupaki Desk | 27 Feb 2016 11:36 AM GMTమూవీ రివ్యూ : టెర్రర్
నటీనటులు: శ్రీకాంత్ - నిఖిత - కోట శ్రీనివాసరావు - నాజర్ - పృథ్వీ - రవివర్మ తదితరులు
సంగీతం: సాయికార్తీక్
ఛాయాగ్రహణం: శ్యామ్ ప్రసాద్
మాటలు: లక్ష్మీభూపాల్
నిర్మాత: షేక్ మస్తాన్
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సతీష్ కాసెట్టి
హీరో శ్రీకాంత్ సినిమా అంటే భయపడే రోజులు కూడా పోయి.. ఇప్పుడు పూర్తిగా పట్టించుకోవడం మానేసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి టైంలో హోప్, కలవరమాయె మదిలో లాంటి అవార్డు సినిమాలు తీసిన సతీశ్ కాశెట్టి దర్శకత్వంలో శ్రీకాంత్ కథానాయకుడిగా నటించిన ‘టెర్రర్’ కొంచెం ఆసక్తి రేపింది. అనేక వాయిదాల తర్వాత ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అయినా శ్రీకాంత్ ఆశించిన విజయాన్నందించిందో లేదో చూద్దాం పదండి.
కథ:
విజయ్ (శ్రీకాంత్) నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్. ఐతే అనుకోని పరిస్థితుల్లో సస్పెండ్ అయిన విజయ్.. డిపార్టుమెంటుకే కాక తన తండ్రికి కూడా దూరమవుతాడు. ఐతే తాను తప్పుచేశానన్న గిల్టీ ఫీలింగులో ఉన్న విజయ్ కి.. తన తప్పు దిద్దుకుని తనేంటో చూపించే అవకాశం లభిస్తుంది. దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి టెర్రరిస్టులు వేసిన ప్లాన్ గురించి తెలుసుకుని.. వాళ్ల ఆట కట్టించడానికి సిద్ధమవుతాడు విజయ్. ఐతే ఉగ్రవాదుల కుట్ర వెనుక ఉన్న ఇంకా పెద్ద మిస్టరీ ఉందని అతడికి అర్థమవుతుంది. ఇంతకీ ఆ మిస్టరీ ఏంటి? ఈ కుట్రను అతనెలా ఛేదించాడు? తనపై పడ్డ మచ్చను చెరిపేసుకుని తండ్రికి ఎలా దగ్గరయ్యాడు? అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
శ్రీకాంత్ హీరోగా ఓ మోస్తరు సినిమా వచ్చి కూడా చాలా ఏళ్లు అయిపోవడంతో.. శ్రీకాంత్ సినిమా అంటే బాగుండదు అని ముందే ఓ నిర్ణయానికి వచ్చేసే పరిస్థితి వచ్చిందిపుడు. ఐతే ‘టెర్రర్’ ఆ కోవలోని సినిమా కాదు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీశ్ కాశెట్టి.. మంచి కథాకథనాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు. చెప్పాలనుకున్న విషయం నుంచి ఏమాత్రం పక్కకు వెళ్లకుండా.. ఉత్కంఠ రేపే కథాకథనాలతో చక్కగా మలిచిన పోలీస్ థ్రిల్లర్.. ‘టెర్రర్’.
పాటలు, కామెడీ ట్రాకులు ఏమీ లేకుండా.. కథ ఎక్కడా పక్కదారి పట్టకుండా సతీశ్ కాశెట్టి రాసుకున్న స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆరంభంలో ఓ 20 నిమిషాలు మామూలుగా, కొంచెం స్లోగా కథనం నడుస్తుంది కానీ.. ఆ తర్వాత మొదలయ్యే టెంపో చివరిదాకా సాగుతుంది. మంచి ట్విస్టులుండేలా స్క్రీన్ ప్లే రాసుకోవడంతో పాటు.. వాటి చుట్టూ ఆసక్తికర సన్నివేశాలు కూర్చుకోవడంతో టెర్రర్ బోర్ కొట్టకుండా సాగిపోతుంది.
శ్రీకాంత్ పాత్రకు సంబంధించి భావోద్వేగాలు చక్కగా పండించడంతో పాటు.. కథలోని లీడ్ పాయింట్ తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. 13 రోజుల వ్యవధిలో జరిగే సంఘటనల చుట్టూ కథను అల్లుకున్న దర్శకుడు.. ఓవైపు కథానాయకుడి సంఘర్షణను చూపిస్తూనే.. మరైవైపు ఉగ్రవాదుల అంశానికి సంబంధించి రోజువారీ పరిణామాలతో కథనాన్ని వేగంగా నడిపించాడు. ముస్లిం టెర్రరిస్టుని శ్రీకాంత్ ఇంటరాగేట్ చేసే సీన్.. టెర్రరిస్టుల కుట్ర వెనుక ఉన్న మిస్టరీ రివీల్ అయ్యే సీన్.. సినిమాకు మేజర్ హైలైట్స్.
పాటలతో పాటు ఇంకే అనవసర ట్రాకులూ లేకపోవడంతో సినిమాను తక్కువ నిడివిలో ముగించడానికి కూడా అవకాశం దక్కింది. దీంతో మామూలుగా మొదలైన ‘టెర్రర్’ చివరికి మంచి ఫీలింగ్ తో ప్రేక్షకుడు థియేటర్ నుంచి బయటికి వెళ్లేలా చేస్తుంది. నిడివి తక్కువ కావడం సినిమాకు ప్లస్. ఐతే శ్రీకాంత్ పాత్రకు సంబంధించి ఎమోషన్ బాగానే ఉంది కానీ.. తండ్రి అతణ్ని అపార్థం చేసుకునే సన్నివేశాన్ని సరిగా తీర్చిదిద్దలేదు. తండ్రీ కొడుకుల అనుబంధాన్ని కూడా ఎలివేట్ చేయలేదు. క్లైమాక్స్ కూడా సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ టైపు జానర్ బేస్డ్ ఫిల్మ్స్ ఇష్టపడేవారిని ‘టెర్రర్’ ఆకట్టుకుంటుంది కానీ.. రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ కోరుకునేవారికి కూడా ఈ చిత్రం నచ్చకపోవచ్చు.
నటీనటులు:
‘ఖడ్గం’లో పోలీస్ పాత్రలో అదరగొట్టిన శ్రీకాంత్.. మళ్లీ ఆ స్థాయిలో తన ముద్ర వేయడానికి ప్రయత్నించాడు. అతడి నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. శ్రీకాంత్ గత సినిమాల్లో కాన్ఫిడెన్స్ కనిపించేది కాదు. కానీ విజయ్ పాత్రను ఇష్టపడటం వల్లో ఏమో కానీ.. చాలా కాన్ఫిడెంటుగా నటించాడు. పోలీస్ పాత్రలో అతడి అగ్రెషన్, సిన్సియారిటీ ఆకట్టుకుంటుంది. మంచి పాత్ర పడితే ఇప్పటికీ తాను అద్భుతంగా పెర్ఫామ్ చేయగలనని శ్రీకాంత్ చాటుకున్నాడు. మిగతా నటీనటుల్లో కోట శ్రీనివాసరావు కూడా తనదైన ముద్ర వేశారు. ఈ మధ్య కాలంలో ఆయనకిది గుర్తుంచుకోదగ్గ పాత్ర. రవివర్మ బాగా చేశాడు. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంత నిఖిత పెద్దగా గుర్తుండదు. నాజర్ ఓకే. పృథ్వీది మామూలు క్యారెక్టరే. అతనీ మధ్య చేస్తున్న పాత్రల తరహాలో ఆశిస్తే కష్టం.
సాంకేతికవర్గం:
పాటల్లేని ఈ సినిమాకు సాయికార్తీక్ బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్ద బలం. కీలకంగా చెప్పదగ్గ సన్నివేశాల్ని నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. ద్వితీయార్ధంలోని టెంపోని మెయింటైన్ చేయడంలో కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించింది. శ్యామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం కూడా బాగుంది. లక్ష్మీభూపాల్ డైలాగులు ఓకే. పాత్రలన్నీ చాలా వరకు తక్కువగా మాట్లాడతాయి. ఆ పరిమితమైన సంభాషణలే బాగున్నాయి. నిర్మాణ విలువలు పర్వాలేదు. బడ్జెట్ పరిమితుల దృష్ట్యా అక్కడక్కడా రాజీ పడ్డ సంగతి అర్థమవుతుంది. ఐతే కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఇలాంటి సినిమాపై పెట్టుబడి పెట్టిన నిర్మాత అభిరుచిని మెచ్చుకోవాలి. సతీశ్ కాశెట్టి దర్శకుడిగా మంచి పట్టు చూపించాడు. కథ మామూలే కానీ.. కథనంతో ఆకట్టుకున్నాడు. ఎక్కడా పక్కదారి పట్టకుండా సిన్సియర్ గా స్క్రీన్ ప్లేను నడిపించాడాయన. ఎన్నో పరిమితులు, అడ్డంకుల మధ్య ఇలాంటి సినిమా తీసిన ఆయన అభినందనీయుడు.
చివరగా: టెర్రర్.. భయపడాల్సిన పని లేదు. ఓ లుక్కేయొచ్చు.
రేటింగ్- 2.75/5