Begin typing your search above and press return to search.
నిలబెట్టాలంటే టెర్రర్ పుట్టించాల్సిందే
By: Tupaki Desk | 27 Feb 2016 4:37 AM GMTహీరో శ్రీకాంత్ మెయిన్ లీడ్ గా వచ్చిన సినిమా ''టెర్రర్''. ఈ సినిమాను దర్శకుడు సతీష్ కాసెట్టి తీసిన తీరు.. పాటలు లేకుండా ఆద్యంతం థ్రిల్లింగ్ గా మలిచిన విధానం.. అన్నీ క్రిటిక్స్ కు కూడా బాగానే నచ్చేశాయి. అయితే ఇదే ఫీలింగ్ ను జనాల్లోకి తీసుకెళ్తేనే తానే సినిమా ధియేటర్ల దగ్గర నిలబడేది. ఈ సినిమా టీమ్ ఆ పనులు చేయడంలో ఎక్కడ వరకు వచ్చారో మరి.
నిజానికి సినిమాకు హిట్ టాక్ లేదా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ఒకెత్తయితే.. దానిని నిలబెట్టుకొని జనాల మనస్సులతో పాటు పర్సులను దోచుకోవడం మరో ఎత్తు. అందుకే సినిమా విడుదలవ్వగానే సక్సెస్ మీట్లు వగైరా పెడుతుంటారు. అయితే ఈ సినిమా విషయంలో ప్రమోషన్ కాస్త ఫ్లాట్ గా డల్ గా ఉందనదేది ట్రేడ్ వర్గాల వాదన. అందుకే మంచి టాక్ వచ్చినా కూడా.. ఆ టాక్ ను జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఇంకో వారం పడుతుందట. ఈలోపు వచ్చే శుక్రవారం 8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. అప్పటికే జెండా ఎత్తేసే ఛాన్సు కూడా ఉంది. అందుకే ఈ తొలి వారంలోనే టెర్రర్ తన ప్రమోషన్లతో టెర్రర్ పుట్టించి.. భారీగా క్యాష్ చేసుకోవాలి.
ఎంత త్వరగా ప్రమోషన్లు చేసుకంటే అంత త్వరగా మాంచి ప్రాఫిట్లు చవి చూడొచ్చు. లెటజ్ సీ.. ఎంతవరకు ఈ టీమ్ సక్సెస్ అవుతారో.