Begin typing your search above and press return to search.

#DRUGS లో ఉగ్ర‌వాద‌మా? ఏకంగా NIA నే దించేస్తున్నారు!

By:  Tupaki Desk   |   23 Sep 2020 6:50 AM GMT
#DRUGS లో ఉగ్ర‌వాద‌మా? ఏకంగా NIA నే దించేస్తున్నారు!
X
వివాహ భోజనంబు హహహ వివాహ భోజనంబు వింతైన వంటకంబు.. వియ్యాలవారి విందు ఓహ్హోహో నాకె ముందు.. అహహహ హహహ హహహ ఔరర గారెల్లల్ల అయ్యారే బూరెలిల్లా ఓహ్హోరె అరిసెలుల్లా ... సుశాంత్ సింగ్ కేసులో ఇంత మ్యాట‌రుంది మ‌రి. మీడియా కూడా ఆ రేంజులోనే టీఆర్పీ విందు ఆస్వాధిస్తోంది.

మొద‌ట ముంబై పోలీస్.. త‌ర్వాత పొరుగు రాష్ట్రం బీహార్ పోలీస్.. ఆ త‌ర్వాత సీబీఐ.. అటుపై ఎన్.సి.బి .. ఇప్పుడు ఏకంగా ఎన్.ఐ.ఏ (NIA) బ‌రిలో దిగుతోంది. ఇదంతా సుశాంత్ సింగ్ కేసులో నిజాల్ని నిగ్గుతేల్చేందుకు డ్ర‌గ్స్ అరాచ‌కాల్ని ప‌రిశోధించేందుకు ఇందులో ఉన్న పెద్ద‌ల్ని క‌నిపెట్టేందుకు ఆడుతున్న వింత నాట‌కం.

DRUGS లింకుతో ఎంతో ఝ‌టిల‌మైన‌ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద‌ మరణ పరిశోధనలో ఎన్‌ఐఏ చేరవచ్చన్న‌ది తాజా అప్ డేట్. ఈ విభాగం ఏ అధికారితో అయినా మాట్లాడేందుకు విచారించేందుకు అనుమతి క‌లిగి ఉంటుంది. వీరికి కూడా పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో ఉండే అన్ని అధికారాల్ని క‌లిగి ఉంటుంద‌ని చ‌ట్టం చెబుతోంది.

ఒక‌సారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే.. జూన్ 14 న నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం రాజకీయ సమస్యగా మారింది. ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు బదిలీ అయ్యేలా చేయడంలో బీహార్ ప్రభుత్వం ముఖ్యమైన పాత్ర పోషించింది. దీనిని మహారాష్ట్ర ప్రభుత్వం విమర్శించింది. ఆ త‌ర్వాత మాదకద్రవ్యాల సంబంధిత కేసులను దర్యాప్తు చేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసింది.

వాస్తవానికి ఎన్.ఐ.ఏ అనేది ఉగ్రవాద సంబంధిత నేరాలను ప‌రిశోధించేందుకు లేదా ఎదుర్కోవటానికి సృష్టించబడిన ద‌ర్యాప్తు సంస్థ‌. కానీ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసులో సినీ పరిశ్రమ మాదకద్రవ్యాల వాడకంపై ప్రధాన దర్యాప్తు జరుగుతోంది. దీంతో ముడిప‌డిన చాలా ఇత‌ర విష‌యాల్ని లాగేందుకే ఇప్పుడు ఎన్.ఐ.ఏ ని రంగంలోకి దించార‌ని మీడియా క‌థ‌నాలొస్తున్నాయి.

అదే జరిగితే ఎన్.ఐ.ఏని దించితే గ‌నుక‌.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తర్వాత ఈ కేసు విచార‌ణ‌కు బ‌రిలో దిగుతున్న‌ నాల్గవ ఫెడరల్ ఏజెన్సీగా ఎన్‌ఐఏ పేరు వినిపిస్తుంది.

నేరాల దర్యాప్తు కోసం ఒక పోలీస్ స్టేషన్ అధికారాలను ఎన్.ఐ.ఏ అధికారికి ఇవ్వడానికి చ‌ట్టం అనుమతిస్తుంది. దేశవ్యాప్తంగా ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడానికి 2008 ముంబై సీరియల్ పేలుళ్ల తర్వాత ఎన్.ఐఏ స్థాపించబడింది. గత సంవత్సరం ఎన్.‌ఐఏ చట్టానికి చేసిన సవరణలో మానవ అక్రమ రవాణా.. నకిలీ నోట్లు .. సైబర్ ఉగ్రవాదానికి సంబంధించిన కేసులను దర్యాప్తు చేయడానికి ఏజెన్సీకి అధికార పరిధి పెంచారు. కానీ మాదకద్రవ్యాల కేసులు ఇప్పటికీ దాని పరిధిలో లేవు. మంగళవారం కేంద్ర ఉత్తర్వు వరకు అండర్ సెక్రటరీ సంతకం చేశారు.

సుశాంత్ సింగ్ కేసులో కొనసాగుతున్న ప్రోబ్స్ పరిధిని ఎన్.ఐ.ఏ విస్తరించగలదని.. ఈ కేసులో డ్రగ్స్.. మనీ లాండరింగ్ .. జాతీయ భద్రతా సమస్యలు వెలుగులోకి వచ్చాయని తాజాగా ఓ ప్రభుత్వ అధికారి మీడియాకి వెల్ల‌డించారు. గతంలో ఎన్‌సిబి డొమైన్ మాత్రమే అయిన కేసులను కూడా ఇప్పుడు ఎన్‌.ఐఏ విచారించ‌గ‌ల‌దు. మంగళవారం నోటిఫికేషన్ రాష్ట్రాలను సంప్రదించినట్లు చెప్పగా.. మహారాష్ట్ర ప్రభుత్వంలోని ఒక మంత్రి దీనికి సంబంధించి ఎటువంటి సమాచార మార్పిడి గురించి తనకు తెలియదని చెప్పారు.