Begin typing your search above and press return to search.
సైరాతో ఆ ఇద్దరికే చిక్కు
By: Tupaki Desk | 12 April 2019 3:30 AM GMTఎప్పుడు విడుదల అవుతుందో స్పష్టత కొరవడిన సైరా కోసం అభిమానుల ఎదురుచూపులు ఇప్పట్లో ముగిసే అవకాశం కనిపించడం లేదు. నిర్మాత చరణ్ దసరాకు రిలీజ్ చేస్తామని ఇంతకు ముందు చెప్పాడు కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే అది కష్టమే అనిపిస్తోంది. ఇప్పుడీ జాప్యం వల్ల నేరుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇద్దరున్నారు.
ఒకరు కొరటాల శివ. చిరు కోసం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ సైరా వల్ల ఎప్పుడు మొదలుపెట్టాలో అర్థం కానీ అయోమయం నెలకొంది. జూన్ అంటూ ప్రచారం జరిగింది కానీ అప్పటికైనా చిరు సైరా సంకెళ్ళ నుంచి ఫ్రీ అవుతారా అనేది అనుమానమే. భరత్ అనే నేను తర్వాత గ్యాప్ ఏడాది దాటేసింది. కొరటాల శివ లాంటి డిమాండ్ ఉన్న డైరెక్టర్స్ కు ఇది ఇబ్బంది కలిగించేదే
మరొకరు దర్శకుడు సురేందర్ రెడ్డి. ధ్రువ నుంచి మెగా కాంపౌండ్ లోనే లాక్ అయిపోయిన ఇతను సైరా రిలీజయ్యాక కానీ ఇంకే సినిమా కమిట్ కాలేడు. దాంతో తన స్టామినా ఏంటో రుజువు చేసుకుంటే స్టార్లే క్యూ కడతారు. ఒకవేళ ఎవరైనా హీరో ఆసక్తిగా ఉన్నా ఒప్పుకునే స్థితిలో సూరి లేడు. బాలన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ సిజి వర్క్ ఇలా చాలా పనులు ఉన్నాయి.
పోనీ కథలు చెప్పి రిజర్వ్ లో పెట్టుకుందామా అంటే అదీ జరగని పనే. సో సైరా పూర్తయితే తప్ప సురేందర్ రెడ్డి ఇంకో ప్రాజెక్ట్ గురించి ఆలోచించలేడు. చాలా డిఫరెంట్ జానర్ లో స్వాతంత్ర సమరయోధుడి కథ తీసుకున్న సూరికి సైరా అగ్ని పరీక్షే. సో కొరటాల శివ - సురేందర్ రెడ్డి ఇద్దరికీ సైరా పూర్తి కావడం అత్యవసరంగా మారిపోయింది