Begin typing your search above and press return to search.
వరస్ట్ అవార్డుల రేసులో మహేష్ మూవీ
By: Tupaki Desk | 6 March 2016 7:30 PM GMTమహేష్ కెరీర్ లోని మైల్ స్టోన్ మూవీస్ లో ‘ఒక్కడు’ ఒకటి. మహేష్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో తొలిసారి అందరికీ రుచి చూపించిన సినిమా ఇది. అప్పట్లో ఇది టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా వచ్చిన దశాబ్దం తర్వాత ‘తేవార్’ పేరుతో హిందీలోకి రీమేక్ చేశారు. కానీ అక్కడి ప్రేక్షకులకు ఈ సినిమా రుచించలేదు. అర్జున్ కపూర్ - సోనాక్షి సిన్హా ఇందులో హీరో హీరోయిన్లుగా నటించారు. సినిమా ఆడకపోతే పోయింది కానీ.. ఏటా బాలీవుడ్ లో వచ్చే చెత్త సినిమాల కోసమంటూ ఏర్పాటు చేసిన కేలా అవార్డుల రేసులో ‘తేవార్’ నిలవడమే విచిత్రం. దీంతో పాటు సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ కూడా ఈ అవార్డుల్లో చాలా నామినేషన్లు దక్కించుకోవడం విశేషం.
ఈ అవార్డుల్లో అత్యధిక నామినేషన్లు దక్కించుకుంది ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ కాగా.. ‘తేవార్’ రెండో స్థానంలో నిలిచింది. ప్రభుదేవా మూవీ ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ తర్వాతి స్థానంలో ఉంది. ఇంకా షారుఖ్ మూవీ ‘దిల్ వాలే’.. అనురాగ్ కశ్యప్ చిత్రం ‘బాంబే వెల్వెట్’ కూడా నామినేషన్లు దక్కించుకున్నాయి. సల్మాన్ ఖాన్ - అర్జున్ కపూర్ ఉత్తమ చెత్త నటుడి పురస్కారానికి పోటీ పడుతుంటే.. సోనమ్ కపూర్ ఉత్తమ చెత్త నటిగా నామినేషన్ దక్కించుకుంది. శ్రద్ధా కపూర్ (ఏబీసీడీ-2) - అమీ జాక్సన్ (సింగ్ ఈజ్ బ్లింగ్) కూడా ఉత్తమ చెత్త నటి రేసులో ఉన్నారు. వీరితో పాటు మాధుర్ బండార్కర్ సినిమా ‘క్యాలెండర్ గర్ల్స్’లో నటించిన ఐదారుగురు హీరోయిన్లందరూ ఉత్తమ చెత్త నటి పురస్కారానికి పోటీ పడుతుండటం విశేషం. ఈ నెల 30 వరకు దీనికి ఓటింగ్ నిర్వహిస్తారు. ప్రేక్షకులు ఓటింగ్ లో పాల్గొని ఉత్తమ చెత్త అవార్డుల్ని ఎంపిక చేస్తారు.