Begin typing your search above and press return to search.
మళ్లీ సీతారామం, బింబిసార, కార్తీకేయ2 రావాల్సిందేనా?
By: Tupaki Desk | 15 Oct 2022 4:30 PM GMTజూన్ లో `మేజర్` మినహా ఏ సినిమా కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక జూలైలో విడుదలైన సినిమాలన్నీ ఇండస్ట్రీకి బిగ్ షాక్ ని అందించాయి. జూన్, జూలై నెల్లో `మేజర్` మినహా ఏ ఒక్క సినిమా థియేటర్లలో నిలబడలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్ని గమనించిన ఇండస్ట్రీ వర్గాలు ఇక టాలీవుడ్ సినిమా పరిస్థితి ఇంతేనా?.. భారీ పాన్ ఇండియా సినిమాలు మాత్రమే చేసుకోవాలా? అనే డైలమాలో పడిపోయారు.
దాదాపు రెండు నెలల పాటు ఒక్క హిట్ కూడా పడకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ బెంబేలెత్తిపోయింది. ఈ సమయంలోనే ఆగస్టు లో విడుదలై సీతారమం, బింబిసార, కార్తికేయ 2` సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ లుగా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. తీవ్ర నిరాశలో వున్న టాలీవుడ్ కు సరికొత్త ధైర్యాన్ని అందించి కొత్త ఆశలు చిగురింపజేశాయి. దీంతో ఇక ప్రతీ నెల బాక్సాఫీస్ వద్ద మన సినిమాలు సందడి చేస్తాయని అంతా భావించారు కానీ సెప్టెంబర్ నుంచి అది జరగడం లేదు.
ఆగస్టులో `సీతారామం, బింబిసార, కార్తికేయ 2` తరువాత విడుదలైన సినిమాలేవీ ఆశించిన ఫలితాల్ని అందించకపోగా భారీ నష్టాలని తెచ్చిపెట్టాయి. ఇక సెప్టెంబర్ లో అయినా పరిస్థితి మారుతుందని ఆశగా ఎదురుచూశారు కానీ నో యూజ్. శర్వానంద్ నటించిన `ఒక ఒక జీవితం` ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకున్నా ఆశించిన స్థాయిలో మాత్రం వసూళ్లని రాబట్టలేకపోయింది. అక్టోబర్ లో చిరు `గాడ్ ఫాదర్`, నాగ్ `ది ఘోస్ట్`, బెల్లంకొండ గణేష్ `స్వాతిముత్యం` సినిమాలు విడుదలయ్యాయి.
ది ఘోస్ట్ ఫ్లాప్ కాగా `స్వాతిముత్యం` ఫీల్ గుడ్ ఎంటర్ టైనరఖ అనిపించుకుందే కానీ టాక్ కు తగ్గట్టుగా వసూళ్లని రాబట్టలేకపోయింది. ఇక చిరు నటించిన `గాడ్ ఫాదర్` కూడా హిట్ అనిపించుకున్నా ఆ స్థాయిలో మాత్రం వసూళ్లని రాబట్టలేకపోతోంది. ఇదిలా వుంటే ఈ సినిమాల తరువాత ఈ వారం ఏకంగా 9 సినిమాలు విడుదలయ్యాయి. క్రేజీ ఫెలో, బాయ్ ఫ్రెండ్ హైర్ సినిమాలకు మినహా ఏ సినిమాకు క్రేజ్ లేదు. ప్రేక్షకుల్లో ఆసక్తి లేదు. ఇక ఈ తొమ్మిది సినిమాల్లో దేనికీ పాజిటివ్ టాక్ లేదు.
దీంతో ఈ సినిమాలకు కనీసం ఖర్చులైనా వస్తాయా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఈ శనివారం కన్నడ సినిమా `కాంతార` విడుదలైంది. బస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. కానీ ఇది కంప్లీట్ గా కన్నడ నేటివిటీ వున్న సినిమా కావడంతో ఇంకా తెలుగు ప్రేక్షకుల్లో దీనిపై దృష్టిపడలేదు. మౌత్ టాక్ అయితే పాజిటివ్ గా బ్లాక్ బస్టర్ టాక్ వుంది.
ప్రభాస్ వంటి స్టార్లు మరీ మరీ ప్రశంసలు కురిపిస్తున్నారు కాబట్టి జనం సినిమా వైపు మళ్లే అవకాశం వుంది. అయితే తెలుగులో ఆగస్టు తరువాత బ్లాక్ బస్టర్ అనదగ్గవి రాకపోవడం..వసూళ్లని ఆ స్థాయిలో రాబట్టలేకపోతుండటంతో మళ్లీ సీతారామం, బింబిసార, కార్తీకేయ2 వంటి సినిమాలు రావాల్సిందే? అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.