Begin typing your search above and press return to search.
అల్లరోడి కంటే ముందు తాగుబోతు..
By: Tupaki Desk | 26 May 2015 10:21 AM GMTమొన్న మంచు మనోజ్ పెళ్లి కళ్లు చెదిరే రేంజిలో చేశాడు మోహన్ బాబు. ఆ పెళ్లి జరిగిన 9 రోజులకే మరో టాలీవుడ్ హీరో పెళ్లి జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ నెల 29న అల్లరి నరేష్, విరూపల పెళ్లి హైదరాబాద్‌లో గ్రాండ్‌గా చేయబోతున్నారు. ఐతే ఆ పెళ్లికి ఒక రోజు ముందే మరో టాలీవుడ్ ఆర్టిస్టు పెళ్లి చేసుకోబోతున్నాడు. అతనే రమేష్. ఉత్త రమేష్ అంటే ఎవరికీ తెలియదు కదా.. ముందు 'తాగుబోతు' అనే పదం చేరిస్తే ఎవరైనా ఇట్టే గుర్తుపట్టేస్తారు. కొంచెం లేటుగా ఇండస్ట్రీలోకి వచ్చి తాగుబోతు క్యారెక్టర్లలో పాపులారిటీ సంపాదించిన రమేష్.. ఈ నెల 28న పెళ్లి చేసుకోబోతున్నాడు.
స్వాతి అనే అమ్మాయితో కొన్ని రోజుల కిందటే రమేష్‌కు నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. 28న నిజామాబాద్‌లోని తన స్వస్థలం కామారెడ్డిలో రమేష్ పెళ్లి జరగబోతోంది. రమేష్ తల్లిదండ్రులు కొమరయ్య, రామిళ్ల లక్ష్మిల పేరుతో సింపుల్‌గా తయారు చేసిన వెడ్డింగ్ కార్డ్‌ను ట్విట్టర్లో పెట్టాడు రమేష్. గురువారం పెళ్లి చేసుకోబోతున్న రమేష్.. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. హోటల్ దస్‌పల్లాలో విందులో టాలీవుడ్ కమెడియన్ కుటుంబంతో పాటు సినీ ప్రముఖులంతా సందడి చేయబోతున్నారు.