Begin typing your search above and press return to search.
తలైవా రాజకీయ పార్టీ సరే.. మూవీ అప్ డేట్ ఏదీ?
By: Tupaki Desk | 12 Dec 2020 1:30 PM GMTఎంతగానో ఎదురుచూసిన ప్రకటన రాకపోతే అభిమానుల్లో కోపం కట్టలు తెంచుకోవడం చూసేదే. ఆర్.ఆర్.ఆర్ విషయంలో జక్కన్నపై ఇప్పటికే బోలెడంత కోపం ప్రదర్శించారు చరణ్-తారక్ అభిమానులు. ఇప్పుడు అంతే కోపం తలైవా రజనీకాంత్ అభిమానులు ప్రదర్శించారు. తలైవానే తిత్తి తీసారు. సోషల్ మీడియాల్లో తీవ్ర నిరాశను వ్యక్తపరిచి ఎమోషన్ కి గురయ్యారు.
అంత పెద్ద తప్పిదం రజనీ ఏం చేశారు? అంటే.. ఆయన పుట్టినరోజు(12-12-20) వేళ రాజకీయారంగేట్రం పై చెబుతానన్నారు కానీ అన్నాథే సినిమా గురించిన సరైన అప్ డేట్ చెప్పలేదనేదే నిరాశను కలిగించిందట. అన్నాథే నిర్మాతలు సరైన సమాచారం ఇవ్వలేదు అంటూ రజనీ అభిమానులు వీరంగం ఆడుతున్నారు. తాజా అప్ డేట్ కోసం ఎదురుచూస్తూ ట్విట్టర్ లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రజనీకాంత్ అన్నాథే డిసెంబర్ 15 నుండి షూటింగ్ పునఃప్రారంభించేందుకు సిరుతై శివ సిద్ధంగా ఉన్నారా లేదా? అంటూ ప్రశ్నించారు. రజనీకాంత్ జనవరి 2021 లో అన్నాథే సెట్స్ లో చేరబోతున్నారా లేదా? అన్నదానిపైనా క్లారిటీ కావాలని ప్రశ్నించారు. అయితే తన రాజకీయ ప్రకటనల మధ్య అన్నాథే షెడ్యూల్ ఎంతమాత్రం చెదిరిపోదని రజనీకాంత్ హామీ ఇచ్చారు.
ఇదివరకూ చెన్నైలో ప్రెస్ తో ప్రసంగిస్తూ ప్రాణాలను పోగొట్టుకున్నా తాను రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని రజనీకాంత్ వెల్లడించారు. రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటిస్తానని.. తమిళనాడులో ఆధ్యాత్మిక పాలన ఏర్పడుతుందని చెప్పారు. గతంలో రజనీ మక్కల్ మండ్రాం జిల్లా కార్యదర్శులను కలిసిన తరువాత రజనీకాంత్ మద్దతుదారులను పలకరించారు. ఇక రజనీ కాంత్ రాజకీయ పార్టీ ప్రకటన ఈనెల 30న ఉండనుంది. జనవరి 1 నుంచి పని మొదలెట్టి సంక్రాంతికి పార్టీపై పూర్తి స్థాయి పాలసీ వివరాలు వెల్లడించనున్నారట.