Begin typing your search above and press return to search.
#తలైవి.. MGR 104వ జయంతి స్పెషల్ లుక్
By: Tupaki Desk | 17 Jan 2021 8:00 AM GMTక్వీన్ కంగన రనౌత్ నటిస్తున్న తాజా చిత్రం `తలైవి`. అమ్మ జయలలిత పాత్రలో కంగన .. ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. ఎఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్- భాగ్యశ్రీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో రిలీజ్ కానున్న ఈ బయోపిక్ ప్రస్తుతం తమిళనాడు సహా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
కంగన రనౌత్ `తలైవి`లో రాజకీయ నాయకురాలిగా మారిన కథానాయిక జయలలిత పాత్రలో వైవిధ్యమైన నటనను కనబరచనున్నారు.ఇప్పటికే తలైవి చిత్రీకరణ పూర్తయింది. ఇంతకుముందు కంగన వైవిధ్యమైన లుక్ లను రిలీజ్ చేయగా అవి అభిమానుల్లోకి దూసుకెళ్లాయి. అలాగే ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి ఫస్ట్ లుక్ కి చక్కని స్పందన వచ్చింది. రాజకీయ నాయకుడు డాక్టర్ ఎం.జి.రామచంద్రన్ గా అరవింద స్వామి పర్ఫెక్ట్ గా యాప్ట్ అన్న ప్రశంసలు దక్కాయి.
నేడు ఎంజీఆర్ 104వ జయంతి సందర్భంగా చిత్రబృందం ఒక కొత్త పోస్టర్ సహా ఆయన జర్నీపై ఓ వీడియోని లాంచ్ చేసింది. ఇది `కథానాయకుడి`గా యుక్తవయస్కుడిగా ఉన్నప్పుడు కథానాయికతో ఎంజీఆర్ రొమాన్స్ చేస్తున్న పోస్టర్. అలాగే వీడియోలో తలైవార్ ఎంజీఆర్ లైఫ్ జర్నీ క్లిప్ లను చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్.. వీడియో వైరల్ గా మారాయి. తలైవికి జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. బాహుబలి.. భజరంగి భైజాన్ చిత్రాలకు కథలు అందించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ తలైవి రచనా ప్రక్రియను పర్యవేక్షించారు. శైలేష్ఆర్ సింగ్ -విష్ణు ఇందూరి- బృందాప్రసాద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.