Begin typing your search above and press return to search.
జయలలిత బయోపిక్ `తలైవి` విడుదల తేదీ
By: Tupaki Desk | 23 Aug 2021 1:30 PM GMTమహమ్మారీ ఓవైపు వెంట తరుముతుంటే సినిమాల్ని పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు నిర్మాతలు భారీ మూల్యం చెల్లించిన సంగతి తెలిసిందే. అన్ని బయోపిక్ ల లానే తలైవి కూడా ఆలస్యమైంది. చిత్రీకరణ సహా రిలీజ్ చిక్కుల్ని ఎదుర్కొంటోంది. ఎట్టకేలకు రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. కంగనా రనౌత్ నటించిన తలైవి ఈ ఏడాది ప్రారంభంలో ఏప్రిల్ 23 న విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు 2021 సెప్టెంబర్ 10 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్నట్లు ప్రకటించారు.
కొత్త విడుదల తేదీని కంగనా ఇన్ స్టాగ్రామ్ ప్రకటించారు. ``అమ్మ జయలలిత వ్యక్తిత్వాన్ని ఆమె కథను బిగ్ స్క్రీన్ పై మాత్రమే చూడడానికి అర్హమైనది! ఆమె సినిమా ప్రపంచంలోకి సూపర్ స్టార్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున... మళ్లీ అదే ధరహాసం! సెప్టెంబర్ 10 న మీకు సమీపంలో ఉన్న సినిమా థియేటర్లలోలో తలైవి చూడండి!`` అని ప్రకటించారు.
నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి ఒక ప్రకటనలో ``తలైవి ప్రతి మలుపులో శాశ్వత అనుభవాలతో విస్తృతమైన ప్రయాణం చేశాం. దేశవ్యాప్తంగా థియేటర్లు తిరిగి తెరుస్తున్నందున అభిమానులు వెండి తెరపై లెజెండ్ జయలలిత జీవితం లోని గొప్ప అనుభూతిని ఆస్వాధించగలరని సంతోషిస్తున్నాము. జయలలిత ఎప్పుడూ సినీ రంగానికి చెందినవారు.ఆమె కథను సజీవంగా తెరపైకి తీసుకురావడమే ఈ గొప్ప లెజెండ్ కి విప్లవ నాయకురాలికి నివాళి అర్పించడానికి ఏకైక మార్గం`` అని ప్రకటించారు.
దివంగత రాజకీయ నాయకురాలు నటి జె.జయలలిత జీవితం ఆధారంగా తలైవి తెరకెక్కగా.. ఆమె జీవితంలోని విభిన్న కోణాలను ఈ చిత్రంలో చూపిస్తున్నారు. చిన్న వయస్సులోనే నటిగా తమిళ సినిమాల్లో ప్రవేశించి ఆ తర్వాత కథానాయికగా ఎదిగారు. విప్లవ నాయకురాలిగా సత్తా చాటారు. తమిళనాడు రాజకీయాల గమనాన్ని మార్చిన శక్తి అయ్యారు. ఈ చిత్రం కోసం కంగన మారిన రూపం అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రైలర్ పాటలు ప్రేక్షకులకు నచ్చాయి.
`తలైవి` చిత్రం సెప్టెంబర్ 10న హిందీ- తమిళం- తెలుగు భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
తలైవి-83 నిర్మాతల `అజాద్ హింద్` ఫ్రాంఛైజీ
విష్ణు ఇందూరి కి చెందిన విబ్రి మీడియా వరుసగా బయోపిక్ చిత్రాల్ని నిర్మిస్తూ సంచలనంగా మారింది. 1983 వరల్డ్ కప్ విక్టరీ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ కపిల్ దేవ్ జీవితకథతో తెరకెక్కిస్తున్న 83 రిలీజ్ కి రావాల్సి ఉంది. ఈ సినిమాతో పాటు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి .. అగ్ర కథానాయిక జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న తలైవి నిర్మాణానంతర పనులు పూర్తవుతున్నాయి. ఈ రెండు చిత్రాలను నిర్మిస్తున్న విబ్రి మీడియా ఇప్పుడు మరో బయోపిక్ కేటగిరీ ఫ్రాంఛైజీని ప్రకటించింది. భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని భారత స్వాతంత్య్ర పోరాటంలో అన్ సంగ్ హీరోలకు నివాళిగా `అజాద్ హింద్` అనే ఫీచర్ ఫిల్మ్ ఫ్రాంచైజీని ప్రకటించారు. విబ్రి మీడియా పతాకంపై విష్ణు ఇందూరి- బృందా ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
`ఆజాద్ హింద్` ఫ్రాంచైజీ నుండి మొదటి చిత్రం దుర్గా భాబిగా ప్రసిద్ధి చెందిన వీరంగనా దుర్గావతి దేవి కథ(బయటకు తెలియనిది)కు ప్రాణం పోస్తుంది. ఆమె బ్రిటీష్ రాజ్ తో పోరాడి భగత్ సింగ్ .. చంద్రశేఖర్ ఆజాద్ వంటి స్వాతంత్య్ర సమరయోధులను ప్రేరేపించింది. బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ బ్యూరో MI 5 ద్వారా దుర్గావతిని `ది అగ్ని ఆఫ్ ఇండియా` అని కూడా పిలుస్తారు.
ఇతర స్వాతంత్య్ర సమరయోధుల్లా కాకుండా భారత స్వాతంత్య్రం తరువాత దుర్గావతి ఒక సాధారణ పౌరురాలిగా నిశ్శబ్దంగా అజ్ఞాతంలో గడిపారు. గజియాబాద్ లో ఇతర జీవితాన్ని ప్రారంభించారు. ఆమె లక్నోలో పేద పిల్లల కోసం ఒక పాఠశాలను ప్రారంభించింది. 1999 అక్టోబర్ 15 న 92 ఏళ్ల వయసులో దుర్గావతి దేవి ఘజియాబాద్ లో మరణించింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో దుర్గావతి దేవి పాత్రలో నటించడానికి ఒక స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేయనున్నారు. ఈ చిత్ర దర్శకుడు తారాగణం వివరాల్ని వెల్లడించాల్సి ఉంది.