Begin typing your search above and press return to search.

ద‌ళ‌ప‌తి విజ‌య్ అభిమాని ఆత్మ‌హ‌త్య‌తో ట్విట్ట‌ర్ లో ఫిక‌ర్

By:  Tupaki Desk   |   15 Aug 2020 6:50 AM GMT
ద‌ళ‌ప‌తి విజ‌య్ అభిమాని ఆత్మ‌హ‌త్య‌తో ట్విట్ట‌ర్ లో ఫిక‌ర్
X
ద‌ళ‌ప‌తి విజ‌య్ ఫ్యాన్స్ ఎంత ఎగ్రెస్సివ్ గా ఉంటారో చెప్పాల్సిన ప‌నే లేదు. త‌మ ఫేవ‌రెట్ హీరో సినిమా విడుద‌ల‌వుతోంది అంటే సందడే సంద‌డి. ఇండ‌స్ట్రీ రికార్డులు బ్రేక్ చేయ‌డం కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూస్తుంటారు. ఇక ద‌ళ‌ప‌తికి ఏ క‌ష్టం వ‌చ్చినా నేరుగా చెన్న‌య్ లోని ఇంటికి వ‌చ్చి ఎంత గా హ‌డావుడి చేస్తారో అప్ప‌ట్లో ఐటీ రైడ్స్ వేళ తెలిసొచ్చింది.

అయితే అలాంటి వీరాభిమాని ఒక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకుని చ‌నిపోవ‌డం క‌ల‌క‌లం రేపింది. ద‌ళ‌ప‌తి అభిమాని బాలా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో ట్విట్ట‌ర్ లో అది కాస్తా ట్రెండింగ్ గా మారింది. #RIP బాల గూగుల్ లో ట్రెండ్ అయ్యింది. బాలాకు ద‌ళ‌ప‌తి ఫ్యాన్స్ నివాళులు అర్పిస్తూ ఇలా ఆత్మ‌హ‌త్య చేసుకోవాల్సింది కాద‌ని.. స‌మ‌స్య ఉంటే త‌మ‌తో షేర్ చేసుకోవాల్సింది అని ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.

ద‌ళ‌పతి విజయ్ తమిళ సినీప‌రిశ్ర‌మ‌లోనే అత్యధిక పారితోషికం తీసుకునే స్టార్. 2019 లో విడుదలైన బిగిల్ సంచ‌ల‌న విజ‌యం సాధించింది. గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రమిది. తరువాత `మాస్టర్` సెట్స్ కెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్ రచన మరియు దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మాస్టర్ లో విజయ్ స‌హా విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. మాలవికా మోహనన్- శాంతను భాగ్యరాజ్- అర్జున్ దాస్- ఆండ్రియా జెరోమియా- రమ్య సుబ్రమణియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా మాస్టర్ విడుదల వాయిదా ప‌డింది.