Begin typing your search above and press return to search.
కోర్టు తీర్పుతో హీరో ఫ్యాన్స్ సోషల్ సందడి
By: Tupaki Desk | 27 July 2021 2:30 PM GMTతమిళ సూపర్ స్టార్ విజయ్ పన్ను ఎగవేత కేసు విషయమై గత కొన్ని రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. ఇంగ్లాండ్ నుండి వచ్చిన ఆయన లగ్జరీ కారు కు చెల్లించాల్సిన పన్ను విషయంలో ఆయనకు మద్రాస్ హైకోర్టు రెండు వారాల క్రితం షాక్ ఇచ్చింది. హీరో అయ్యి ఉండి మీరు అందరికి ఆదర్శంగా ఉంటూ పన్ను చెల్లించాలి. రీల్ హీరో మాత్రమే కాకుండా రియల్ హీరోగా కూడా మీరు ఉన్నప్పుడే మిమ్ముల అందరిని ఆదర్శవంతంగా తీసుకుంటారు అంటూ ఆ పన్ను చెల్లించాలని.. దాంతో పాటు లక్ష రూపాయలను జరిమానాగా విధించింది.
సింగిల్ బెంచ్ విధించిన జరిమానాపై ద్విసభ్య ధర్మాసనంను విజయ్ ఆశ్రయించాడు. మద్రాస్ హైకోర్టులో విచారణ జరిగిన ఈ కేసులో జస్టీస్ హేమలత మరియు ఎం దురైస్వామి లతో కూడిన ధర్మాసనం విజయ్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. పన్ను చెల్లింపు విషయంలో సింగిల్ బెంచ్ విధించిన జరిమానాపై స్టే విధించింది. విజయ్ బకాయి పడ్డ 80 శాతం పన్నును మాత్రం చెల్లించాల్సిందే అంటూ కోర్టు తీర్పులో పేర్కొన్నారు. విజయ్ తన కారు పన్ను పై 80 శాతం రాయితీ కోరాడు. అయితే అధికారులు 80 శాతం రాయితీకి ఒప్పుకోలేదు. అయినా కూడా విజయ్ కేవలం 20 శాతం పన్నును మాత్రమే చెల్లించాదు. దాంతో వివాదం మొదలు అయ్యింది.
విజయ్ పన్ను చెల్లించలేదు అంటూ మొదలైన వివాదం కోర్టు విజయ్ కి లక్ష రూపాయల జరిమానా విధించే వరకు వెళ్లింది. విజయ్ కి విధించిన జరిమానాను తాజా తీర్పు లో కొట్టి వేయడంతో సోషల్ మీడియాలో ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. రెండు వారాల క్రితం విజయ్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చిన సమయంలో ఆయన యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు మామూలుగా లేవు. ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేసేలా కొందరు యాంటీ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం విజయ్ కి అనుకూలంగా తీర్పు వచ్చిందంటూ అభిమానులు సందడి చేస్తున్నారు.
న్యాయం గెలిచింది.. మిస్టర్ పర్ఫెక్ట్ విజయ్ అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ఎత్తు ఆయన అభిమానులు ట్వీట్స్ చేస్తున్న నేపథ్యంలో ఇండియా వైడ్ గా ఆయన హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. విజయ్ అభిమానులు సాదారణంగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇప్పుడు వారు తమ హీరోకు పాజిటివ్ గా తీర్పు వస్తే ఊరుకుంటారా.. దేశంలో అత్యంత జెన్యూన్ గా పన్ను కట్టేది మా హీరో మాత్రమే అని.. ఇప్పటి వరకు రెండు సార్లు ఐటీ వారు రెండు మూడు సార్లు విజయ్ ఇంట్లో సెర్చ్ చేసినా కూడా ఏమీ పట్టుకోలేక పోయారు అంటూ అభిమానులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు.
వరుసగా వందల కోట్ల సినిమాలు చేస్తున్న విజయ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అయిన వెంటనే తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుంది. తెలుగు మరియు తమిళంలో ఒకే సారి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. తమిళంలో తన ప్రతి సినిమాతో వంద కోట్లు అంతకు మించి దక్కించుకుంటున్న విజయ్ ఇప్పుడు పాన్ ఇండియా మూవీని ప్రయత్నించబోతున్నాడు. బాలీవుడ్ మరియు టాలీవుడ్ లో తన అదృష్టంను పరీక్షించుకోబోతున్న విజయ్ కి తాజా తీర్పు చాలా ఆనందం కలిగించే విషయం అనడంలో సందేహం లేదు.