Begin typing your search above and press return to search.
ఇతర స్టార్లను మెచ్చే అహం లేని స్టార్!
By: Tupaki Desk | 5 Nov 2021 11:30 PM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా `ఎవరు మీలో కోటీశ్వరుడు?` షో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో ఎప్పటికప్పుడు స్పెషల్ గెస్టులతో ముచ్చటిస్తూ తారక్ టీవీ షో టీఆర్పీని పెంచుతున్నారు. ఈసారి ఆ ఛాయిస్ సంగీత దిగ్గజాలు దేవీశ్రీ-థమన్ లకు దక్కింది. ఈ వేదికపై తారక్ తో తమ అనుబంధాన్ని ఆ ఇద్దరూ పంచుకున్నారు. తారక్ తో తమకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అనుభవాలను కూడా వారు వెల్లడించారు.
``అల వైకుంఠపురములో విడుదలైన వెంటనే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి మీరే. ఎవరైనా డిస్ట్రిబ్యూటర్ లేదా ఇతరులు నన్ను పిలుస్తారని నేను ఆశించాను. కానీ నన్ను పిలిచి అభినందించిన మొదటి వ్యక్తి మీరే. దాన్ని అస్సలు మర్చిపోలేను`` అని థమన్ వెల్లడించాడు. తారక్ తనకు అర్ధరాత్రి కాల్స్ ఎలా చేస్తాడో కూడా థమన్ ఈ వేదికపై చెప్పాడు.
దేవీశ్రీ కూడా తన అనుభవాల్ని పంచుకున్నారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లే విమానంలో దేవిశ్రీ ప్రసాద్ ని తొలిసారిగా ఎలా కలిశాడో తారక్ గుర్తు చేశాడు. చాలా ఏళ్ల తర్వాత కూడా ప్రతిదీ మర్చిపోకుండా గుర్తు చేయడంతో దేవీశ్రీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వర్షం మిక్సింగ్ సమయంలో ఎన్టీఆర్ తనను ఎలా పిలిచాడో కూడా దేవి వివరించాడు. తారక్ జ్ఞాపకశక్తిని కొనియాడారు. `నేను ఎన్టీఆర్ ని.. నేనే ఎన్టీఆర్ ని`` అంటూ తారక్ ఎంతో ఉత్సాహంగా సంభాషించడం ఆసక్తిని కలిగించింది. ఇక ఈ ఎపిసోడ్ చూసిన వారికి చాలా సంగతులు అర్థమయ్యాయి. ఇతర స్టార్ల హిట్ చిత్రాలను మెచ్చుకునే అహం తమ స్టార్ కి లేదని ఎన్టీఆర్ అభిమానులు గర్వంగా చెప్పుకునేంతగా ఈ షో సాగింది. ఆసక్తికరంగా తారక్ అయినా లేదా బాలయ్య అయినా లేదా విజయ్ దేవరకొండ అయినా కానీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రతిసారీ వారి సినిమాలపై ప్రశంసలు కురిపించే స్వభావం బన్నీకి ఉంది. ఇతర స్టార్లు సక్సెస్ సాధించినప్పుడు వారికి ప్రత్యేకించి అభినందనలు తెలియజేయడం బన్నీకి హ్యాబిట్.