Begin typing your search above and press return to search.

విమర్శకులకు తమన్ జవాబిది...

By:  Tupaki Desk   |   17 April 2016 5:47 AM GMT
విమర్శకులకు తమన్ జవాబిది...
X
తన సంగీతం మీద.. ప్రస్తుత తెలుగు సినిమా పాటల తీరు మీద వస్తున్న విమర్శల మీద స్పందించాడు యంగ్ మ్యూజిక్ గన్ తమన్ శివకుమార్. తెలుగులో పరభాషా గాయకులకే పెద్ద పీట వేస్తుండటం మీద అతను మాట్లాడుతూ.. ‘‘అసలు అచ్చమైన తెలుగు పాటలు రాయడమే తగ్గిపోతోంది. పాటల్లో ఇంగ్లిష్.. హిందీ పదాలు ఎక్కువ వాడుతున్నాం. అలాంటిపుడు హిందీ గాయకులు పాడితే తప్పేముంది? ఒక్కోసారి పాటలో అర్థం పర్థం లేని పదాలు వస్తుంటాయి. దానికి నేనే బాధ్యత వహిస్తా. ఐతే పాట అన్నది ఏ ఒక్కరు తీసుకునే నిర్ణయం మీదో ఆధారపడి ఉండదు. అందరూ కలిసే ఓ పాట ఫైనల్ చేస్తాం. కాబట్టి అందరం బాధ్యత వహించాలి’’ అన్నాడు తమన్. ప్రతి సంగీత దర్శకుడికీ ఓ ప్రత్యేకమైన సౌండింగ్ ఉంటుందని.. అలాగే తనకంటూ ఓ స్టయిల్ ఉందని.. ఆ స్టయిల్ ప్రతి సినిమాలో కనిపిస్తుంది కాబట్టే తన పాటలు ఒకే రకంగా ఉంటాయన్న విమర్శలు వస్తుంటాయని తమన్ చెప్పాడు.

ట్యూన్ కట్టిన తర్వాతే పాట రాయడం వల్లే మంచి పాటలు రాయడం లేదన్న ఎస్పీ బాలసుబ్రమణ్యం విమర్శలపై తమన్ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుత ట్రెండు ఎలా ఉందో అలా చేయాలి. అంతే కానీ ఎప్పుడో ఏదో జ‌రిగింది అలాగే చేయాలంటే క‌రెక్ట్ కాద‌ని నా అభిప్రాయం. శంక‌రాభ‌ర‌ణం.. స్వాతిముత్యం త‌ర‌హా సినిమాలు ఇప్పుడు ఎవ‌రూ తీయ‌డం లేదు క‌దా. ఒక‌వేళ తీసినా ఆ తరహా సినిమాల్లో ఐటెం సాంగ్స్ పెట్ట‌లేం క‌దా. శ్రీరామ‌రాజ్యం సినిమాకు త‌గ్గ‌ట్టే మ్యూజిక్ అందించారు. ఈ సినిమా నాకు బాగా న‌చ్చింది. నేనే ప‌దిసార్లు చూశాను. అలాగే బాలు గారు కూడా మాస్ పాటలు.. డ్యూయెట్లు.. ఐటెం సాంగ్స్.. ఇలా అన్ని ర‌కాల పాట‌లు పాడే ఈ స్ధాయికి వ‌చ్చారు. ఒకప్పుడు క్రికెట్లో టెస్టు మ్యాచులే ఆడేవాళ్లు.. తర్వాత వన్డేలొచ్చాయి.. ఇప్పుడు టీ20లు ఆడుతున్నారు. అలాగే మ్యూజిక్ కూడా కాలానికి తగ్గట్లు మారాలి’’ అని తమన్ అన్నాడు.