Begin typing your search above and press return to search.

థ‌మ‌న్ దంపుడికి థియేట‌ర్ల‌కు బీట‌లు!

By:  Tupaki Desk   |   3 Dec 2021 5:40 AM GMT
థ‌మ‌న్ దంపుడికి థియేట‌ర్ల‌కు బీట‌లు!
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన `అఖండ‌` డిసెంబ‌ర్ 2న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజైన సంగ‌తి తెలిసిందే. ప‌క్కా బోయ‌పాటి మార్క్ చిత్రంగా టాక్ వ‌చ్చింది. భారీ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఓ సెక్ష‌న్ ఆడియన్ ని బాగానే ఆక‌ట్టుకుంటోంది. ఇక సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్ అందించిన బీజీఎమ్ అయితే మామూలుగా లేదు. హెయిర్ రైటింగ్ బీజీఎమ్ తో సౌండ్ ఎఫెక్స్ట్ అందించ‌డంలో థ‌మ‌న్ త‌నకి తానే సాటి అని మ‌రోసారి నిరూపించారు. నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవ‌ల్ కి తీసుకెళ్లింది. దీంతో థియేట‌ర్ ఎక్స్ పీరియ‌న్స్ ఎలా ఉంటుంది? అన్న‌ది థ‌మ‌న్ చెప్ప‌క‌నే చెప్పారు.

అయితే ఇండియాలో సౌండ్ ప‌రంగా వ‌యోలెన్స్ ఎలా ఉన్నా ప‌ర్వాలేదు. భార‌తీయ చ‌ట్టాల ప్ర‌కారం మ్యానేజ్ చేసేయోచ్చు. కానీ ఇత‌ర దేశాల్లో అలా కుద‌ర‌దు క‌దా. అందులోనూ అమెరికా లాంటి దేశంలో అన్ లిమిటెడ్ సౌండింగ్ కి చ‌ట్టాలు ఒప్పుకోవు. థ‌మ‌న్ దెబ్బ‌కి అమెరికాలోని సినిమార్క్ థియేట‌ర్ బాక్సులు బ‌ద్ద‌లైన‌ట్లే తెలుస్తోంది. సాధార‌ణ డెసిబిల్స్ స్థాయిని మించి సౌండింగ్ ఉండ‌టంతో ఆడియ‌న్స్ తో పాటు..స్పీక‌ర్లు కూడా పగిలిపోతాయ‌ని యాజ‌మాన్యం ఓ లేఖ‌ని సైతం రిలీజ్ చేసింది. సినీ మార్క్ త‌ర‌లి వ‌చ్చే ప్రేక్ష‌కులంద‌రికీ విష‌యాన్ని ముందే చెబుతూ అసౌక‌ర్యానికి చింతిస్తున్నామ‌ని బ‌య‌ట బోర్డులు కూడా ఏర్పాటు చేసారు.

అలాగే సౌండింగ్ విషయంలో విదేశీ చ‌ట్టాలు అమ‌లు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కూ ఇలాంటి ఎక్స్ పీరియ‌న్స్ ని ఏ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఫేస్ చేసి ఉండ‌రు. ఆ ర‌కంగా థ‌మ‌న్ తొలి మ్యూజిక్ డైరెక్ట‌ర్ అవుతారు. బాలయ్య కోసం థ‌మ‌న్ ఎంత హార్డ్ వ‌ర్క్ చేసారో ఎంత‌గా శ్ర‌ద్ధ పెట్టారో ఈ స‌న్నివేశం చెప్ప‌క‌నే చెబుతుంది. ఇండియాలో ఇలాంటివి పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ఎంత వాయిస్తే అంత మైలేజ్ సినిమాకి ఉంటుంది. అదీ లెక్క మ‌రి ఇక్క‌డ‌.