Begin typing your search above and press return to search.

గుమ్మడి కాయలు కొడుతూనే ఉన్నారు...

By:  Tupaki Desk   |   16 Aug 2015 6:25 AM GMT
గుమ్మడి కాయలు కొడుతూనే ఉన్నారు...
X
ఇటీవలి కాలంలో సినిమాల రిలీజ్‌ లు అనుకున్న టైమ్‌ లో అవ్వడం లేదు. రుద్రమదేవి 3డి ఆలస్యానికి రకరకాల కారణాలున్నాయి. ఇది భారీ కాన్వాసుపై తెరకెక్కిన 3డి సినిమా కాబట్టి ఆలస్యం సహజం. కానీ ఒక మామూలు మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కిన కిక్‌ 2 సైతం ఇదే తరహాలో రిలీజ్‌ విషయంలో ఆలస్యమైంది. దర్శకనిర్మాతల మధ్య క్లాషెస్‌ వల్ల కొంత ఆలస్యమైందన్న ప్రచారం సాగింది.

అయితే అన్ని ఇబ్బందుల్ని అధిగమించి చివరికి కిక్‌2 ఈనెల 21న రిలీజ్‌ కి వస్తోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు శరవేగంగా సాగుతున్నాయి. థమన్‌ నిన్ననే డాల్బీ అట్మోస్‌ సౌండ్‌ మిక్సింగ్‌ కి సంబంధించిన పనులు పూర్తి చేశారు. మిగతా పనుల్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఇక రిలీజ్‌ కన్ఫమ్‌ అయినట్టే. మాస్‌ మహరాజ్‌ రవితేజ పవర్‌ లాంటి హిట్‌ సినిమా తర్వాత నటించిన చిత్రమిది. రేసుగుర్రం వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కూడా. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

అయితే నిన్న రాత్రి తమన్‌ బాబు దగ్గరుండి మరీ డాల్బీ అట్మోస్‌ వర్కు మొత్తం ముగించేసి.. దానికి కూడా ఒక గుమ్మడి కాయ కొట్టించాడు. ఎప్పుడో మే నెలలో విడుదల కావల్సిన సినిమా. ఇంకా ఇప్పటికీ గుమ్మడి కాయలు కొడుతూ ఉండటమేటండీ బాబూ... ఒకవేళ రిలీజ్‌ డేటు మళ్ళీ పోస్టుపోన్‌ అయితే మళ్ళీ ఏదైనా పని మొదలెడతారేమో. 21న వచ్చేయండి బాసూ.. బాగా లేటైపోయింది.