Begin typing your search above and press return to search.

పికె క్రియేటివ్ వర్క్స్ లో థమన్

By:  Tupaki Desk   |   28 Nov 2017 4:59 PM GMT
పికె క్రియేటివ్ వర్క్స్ లో థమన్
X
డప్పుల మోత అయినా స్వీట్ మెలోడీస్ అయినా థమన్ ఇచ్చే బిట్స్ ఎంత సూపర్బ్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత రోజుల్లో వరుసగా అవకాశాలను అందుకోవడం అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి. కానీ థమన్ మాత్రం స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న హీరోల వరకు సినిమాలని చేశాడు. దాదాపు 70 సినిమాలకు పైగా తన మ్యూజిక్ ని అందించాడు. ఈ మద్యన బాలీవుడ్ లో కూడా మంచి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకొని టెంపర్ రీమేక్ అవకాశాన్ని దక్కించుకున్నడు.

తెలుగులో కూడా ప్రస్తుతం కొన్ని సినిమాలని చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇక జవాన్ సినిమా త్వరలో థియేటర్స్ లో సందడి చేయనుంది. అయితే రీసెంట్ గా ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మరో మంచి ఛాన్స్ అనుకున్నాడు. త్వరలో నితిన్ 25వ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ పికే క్రియేటివ్ వర్క్స్ లో మొదటి సినిమాను చేయనున్నాడు. అయితే ఆ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా సెట్ అయ్యాడు. రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు.

ఇక నితిన్ 25వ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. శ్రేష్ట్ మూవీస్ ప్రొడక్షన్ టీమ్ కూడా ఆ సినిమా సహా నిర్మాణంలో భాగం కానుంది. కృష్ణ చైతన్య దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై నితిన్ చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ షూటింగ్ కూడా అయిపోయిందట. త్వరలోనే సినిమా టైటిల్ ని ఎనౌన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని చిత్ర యూనిట్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమాలో ’లై‘ భామ మేఘ ఆకాష్ మరోసాని నితిన్ తో జోడి కట్టింది.