Begin typing your search above and press return to search.

ట్యూన్ తీసుకున్నాడా.. దించేశాడా..

By:  Tupaki Desk   |   9 Sept 2017 2:05 PM IST
ట్యూన్ తీసుకున్నాడా.. దించేశాడా..
X
ఈ రోజుల్లో పాత కథలనే పెంచు మీద రొట్టెలాగా తిప్పి తిప్పి కొడుతూ మాడిపోయేంత వరకు ప్రేక్షకులకు వడ్డించేస్తున్నారు. దీంతో ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో తిప్పి కొడుతున్నారు. అయితే ఇలాంటి దోరని ఇప్పుడు సంగీత దర్శకులకు కూడా బాగానే వంటపట్టింది. ఎక్కడో ఉన్న ట్యూన్స్ ని కొట్టేస్తూ దర్శకులకు హీరోలకు తెలియకుండా సినిమాల్లో కొట్టేస్తూ మెప్పిస్తున్నారు.

ప్రస్తుతం ఆ తరహాలో ఎక్కువగా థమన్ వినిపిస్తున్నాడు. మనోడి దగ్గర టాలెంట్ ఉన్నా అప్పుడప్పుడు తప్పటడుగులో కాలు వేయకుండా ఏకంగా ఈతనే కొట్టి దొరికిపోతున్నాడు. అలాగే ఇతర హీరోలకు ఇచ్చిన ట్యూన్స్ ని అక్కడక్కడా అరిచగిపోయేంతవరకు వాయిస్తూ కవర్ చేస్తున్నాడు. ఇక బిజినెస్ మ్యాన్ లో "బెల్లా సియో" అనే ఇటాలియన్ సాంగ్ ట్యూన్ ని పిల్లా చావ్ అని తెలుగు ప్రేక్షకులకు అందించిన విషయం తెలిసందే.

అయితే ఇప్పుడు అదే తరహాలో 1980 లో కెవి. మహదేవన్ సంగీతం అందించిన "శుభోదయం" సినిమాలోని 'గంధము పూయరుగా' అనే ట్యూన్ ని శర్వానంద్ - మాహానుభావుడు సినిమాలోకి వాడేశాడని అంటున్నారు మ్యూజిక్ లవ్వర్స్. గీతామాధురితో పాడించిన ఈ పాట మొదటి లైన్ సేమ్ ఓల్డ్ సాంగ్ ట్యూన్ లానే ఉంది. ఆ తరువాత కాస్త డిఫరెంట్ గా చేశాడు. కాని ఒక కర్ణాటిక్ రాగం కాబట్టే వాడుకున్నాడా.. లేకపోతే ఎవ్వరికీ తెలియదని దించేశాడా.. జనాలకు ఇంకా అర్ధంకాలేదు. చూద్దాం తమన్ ఏమని చెబుతాడో!!