Begin typing your search above and press return to search.

ఆమెను 'మార్నింగ్ గేల్' అంటున్నాడు

By:  Tupaki Desk   |   9 July 2017 5:22 AM GMT
ఆమెను మార్నింగ్ గేల్ అంటున్నాడు
X
శ్రేయా ఘోషల్ ఎంత గొప్ప సింగర్ అని చెప్పడానికి మాటలు చాలవు. ఆమె పాడిన ప్రతీ పాటా ఛార్ట్ బస్టర్స్ గా నిలుస్తున్నాయంటే.. ఆ పాటకు తన స్వరంతో ఎంతగా ప్రాణం పోస్తుందో అర్ధమవుతుంది. అలాంటి సింగర్ తో వర్క్ చేసేందుకు మ్యూజి డైరెక్టర్స్ తో బోలెడంత ఉత్సాహం చూపిస్తుంటారు.

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ కూడా ఇప్పుడు శ్రేయా ఘోషల్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. ప్రస్తుతం ఫిదా చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసిన వరుణ్ తేజ్.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి పాటల రికార్డింగ్ కూడా జరిగిపోతోంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఎస్ ఎస్ థమన్ ఓ పాటను శ్రేయా ఘోషల్ తో పాడించాడు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి దిగిన ఓ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు థమన్. నైటింగేల్ మాదిరిగా ఆమెను మార్నింగ్ గేల్ అంటూ అభివర్ణించాడు థమన్.

'ఒక సింగర్ తో వర్క్ చేసినపుడు బోలెండత సంతోషంగా గడిపితే.. అవుట్ పుట్ ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. మా మార్నింగ్ గేల్ శ్రేయా ఘోషల్' అంటూ ట్వీట్ చేశాడు థమన్. ఆ సంగతేమో కానీ.. సింగర్ శ్రేయా ఘోషల్ ను మార్నింగ్ గేల్ అని వర్ణించడమే.. ఇక్కడ బాగా హైలైట్ అవుతోంది. ఓ కొత్త పదాన్ని వాడుతున్నాడంటే.. ఈ వర్డ్ ను పట్టుకుని ఓ పాట కంపోజ్ చేసేస్తాడేమో అనిపించకమానదు.