Begin typing your search above and press return to search.
ఆ విషయంలో థమన్.. దేవిశ్రీ ది ఒకే అభిప్రాయం
By: Tupaki Desk | 7 Jan 2022 6:30 AM GMTప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా సంగీత ప్రపంచంలో రారాజులు అంటే ఖచ్చితంగా దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్ ల పేరు ముందు వరుసలో వినిపిస్తాయి. ఇద్దరు కూడా పోటా పోటీగా మ్యూజిక్ ఇస్తూ మ్యూజికల్ హిట్స్ ను దక్కించుకుంటున్నారు. గత ఏడాది అల వైకుంఠపురం లో సినిమా తో థమన్ బాక్స్ బద్దలు కొట్టాడు. ఇక ఈ ఏడాది పుష్ప సినిమా తో దేవి శ్రీ ప్రసాద్ ఆల్ టైమ్ రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. ఇక థమన్ అఖండ సినిమా కు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి బాలీవుడ్ లో కూడా చర్చించుకుంటున్నారు. అంతటి క్రేజ్ ను వీరిద్దరు దక్కించుకున్న నేపథ్యంలో వీరికి బాలీవుడ్ నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. అయితే వీరిద్దరు బాలీవుడ్ కు వెళ్లేందుకు ఆసక్తిగానే ఉన్నారు కాని ఒక్క విషయం వల్ల అక్కడ సినిమాలు చేసేందుకు సిద్దం అవ్వడం లేదు.
బాలీవుడ్ లో ఉన్న ఒక చెడ్డ అలవాటు వీరిద్దరిని బాలీవుడ్ కు దూరం చేస్తుంది. ఇద్దరు కూడా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చే విషయంలో ఒకే ఒక్క అభిప్రాయంను కలిగి ఉన్నారు. అదే హిందీ సినిమా కు ఒక్కరు కాకుండా నలుగురు అయిదుగురు సంగీత దర్శకులు వర్క్ చేస్తారు. అలా చేయడం అనేది నచ్చడం లేదు.. ఒక సినిమా సంగీత బాధ్యతలు పూర్తిగా ఒక్కరికే అప్పగిస్తే అక్కడ సినిమాకి సంగీతాన్ని ఇచ్చేందుకు నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇదే విషయాన్ని కాస్త అటు ఇటుగా సేమ్ టు సేమ్ దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్ లు వేరు వేరుగా వేరు వేరు సందర్బాల్లో చెప్పుకొచ్చారు. బాలీవుడ్ లో ఒక్కో పాటకు ఒక్కో సంగీత దర్శకులు మాత్రమే కాకుండా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను కూడా ఒక్కరు కాకుండా ఇద్దరు సంగీత దర్శకులతో చేయించిన సందర్భాలు అక్కడ ఉన్నాయి.
కాని మన సౌత్ లో మాత్రం ఒక సినిమా కు సంగీత దర్శకుడిగా ఒకే ఒక్కరి పేరు ఉంటుంది. అందుకే వీరిద్దరు ఇక్కడ సినిమాలు మాత్రమే చేస్తామంటున్నారు. దేవి శ్రీ ఇటీవల ఒక సందర్బంగా మాట్లాడుతూ బాలీవుడ్ సినిమాల పాటలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయి... కాని ఆ పాటను ట్యూన్ చేసిన సంగీత దర్శకుడు ఎవరు అనే విషయం మాత్రం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఒకే సినిమా కు నలుగురు అయిదుగురు సంగీత దర్శకులు ఉంటే అదే కన్ఫ్యూజన్ అన్నట్లుగా దేవి శ్రీ ప్రసాద్ చెప్పుకొచ్చాడు. గతంలో తనకు కూడా బాలీవుడ్ నుండి ఆఫర్లు వచ్చాయని.. కాని ఒక పాట రెండు పాటలు అంటూ అక్కడి వారు అడిగే వారని.. పూర్తి సినిమా బాధ్యత అప్పగిస్తేనే తాను చేసేందుకు ఓకే చెప్తాను అన్నట్లుగా థమన్ కూడా చెప్పుకొచ్చాడు.
మొత్తానికి వీరిద్దరు సౌత్ స్టార్ సంగీత దర్శకులు కూడా ఒకే అభిప్రాయంతో బాలీవుడ్ ఎంట్రీ విషయంలో ఉన్నారు కనుక ముందు ముందు వీరికి బాలీవుడ్ సినిమాలో అన్ని పాటలు చేసే అవకాశం.. సంగీత దర్శకుడిగా సింగిల్ కార్డ్ పొందే అవకాశం దక్కుతుందా అనేది చూడాలి. అయినా వీరిద్దరు బాలీవుడ్ వరకు వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు.. ఇద్దరు కూడా ఇక్కడే ఓ రేంజ్ లో పారితోషికం తీసుకుంటూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఏడాది అరడజనుకు పైగా పెద్ద సినిమా లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. కనుక వీరికి బాలీవుడ్ ఎంట్రీ కావాలని పెద్దగా లేదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.