Begin typing your search above and press return to search.

మహేశ్ ఎనర్జీ మామూలుగా లేదు: తమన్

By:  Tupaki Desk   |   17 May 2022 12:30 AM GMT
మహేశ్ ఎనర్జీ మామూలుగా లేదు: తమన్
X
ఈ మధ్య కాలంలో ఎక్కడ .. ఏ సినిమా స్టేజ్ పై చూసినా తమన్ కనిపిస్తున్నాడు .. ఆయన మాట .. పాట వినిపిస్తున్నాయి. వరుస హిట్లతో ఆయన తన జోరు .. హోరు చూపిస్తున్నారు. ఆయన సంగీతాన్ని సమకూర్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంటూ వెళుతోంది. దాంతో స్టార్ హీరోలంతా తమ సినిమాకి ఆయనే పని చేయాలని వెయిట్ చేస్తున్నారు. తాజాగా వచ్చిన 'సర్కారువారి పాట' సినిమాకి కూడా ఆయనే బాణీలను అందించారు. కర్నూల్ లో జరిగిన ఈ సినిమా సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు.

"ముందుగా అనంత్ శ్రీరామ్ కి థ్యాంక్స్ చెప్పాలి. ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. పెన్ను అంతే ఉంటాడు .. ఆయన ఇంకు .. మాట రెండూ సింకులో ఉంటాయి. ఆ తరువాత నిర్మాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోవిడ్ సమయంలో ఈ సినిమాను ఒక దారికి తీసుకుని రావడమనేది మాకు ఒక పెద్ద బాధ్యతగా మారింది. ఈ సినిమాలోని పాటలన్నిటినీ రెండేళ్ల క్రితమే కంపోజ్ చేయడం జరిగింది.

పరశురామ్ దగ్గరుండి .. పట్టుబట్టి పాటలు చేయించుకున్నారు. ఇక్కడ 'పెన్నీ' అనే రావాలి .. ఇక్కడ 'కళావతి' అనే పేరే రావాలి .. మ మ మహేశా .. అనే కావలి అని ఆయన పట్టుబట్టేవారు. ఈ ఆల్బమ్ క్రెడిట్ అంతా కూడా నేను పరశురామ్ కే ఇస్తాను. అంతలా ఆయన పట్టుబట్టి చేయించుకున్నాడు. మహేశ్ బాబుగారి పట్ల తనకి గల ప్రేమను పాటల్లో కూడా చూపించాడు. ఆయన అంతగా పట్టుబట్టకపోతే నేను ఇలా చేసుండేవాడిని కాదేమో.

ఈ సినిమా 12వ తేదీన విడుదలైతే 9వ తేదీ రాత్రి వరకూ పని చేయించుకుంటూనే ఉన్నారు. ఇంత ఎనర్జీ ఉండటానికి కారణం మహేశ్ బాబుగారు. ఒక్కొక్క సీన్ లో ఆయన ఇచ్చిన ఎనర్జీ మామూలుగా లేదు. రెండు మూడు కీబోర్డులు ఇరిగిపోయాయి. నేను ఆయనను 'బిజినెస్ మెన్ నుంచి చూస్తున్నాను. ఒక్కో సినిమాకి ఆయన అలా ఎదిగిపోతున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని మేము అనుకున్నాము. అందుకు ఎంతమాత్రం తగ్గకుండా మీరు చూసుకున్నారు. ఈ సక్సెస్ కి కారణమైన మీ అందరికీ ధన్యవాదాలు" అంటూ ముగించారు.