Begin typing your search above and press return to search.

మహేశ్ - నమ్రతలను థమన్ ఎలా ఒప్పించాడు..?

By:  Tupaki Desk   |   1 May 2022 11:30 AM GMT
మహేశ్ - నమ్రతలను థమన్ ఎలా ఒప్పించాడు..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార ఘట్టమనేని మల్టీ టాలెంటెడ్ అనే సంగతి సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండేవారందరికీ తెలుస్తుంది. ఇటీవల తన తండ్రితో కలిసి 'పెన్నీ' సాంగ్ మ్యూజిక్ వీడియోలో కనిపించి అందరినీ ఆశ్చర్య పరిచిందీ సూపర్ కిడ్.

మహేశ్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ''సర్కారు వారి పాట''. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన సెకండ్ సింగిల్ 'పెన్నీ' సోషల్ మీడియాలో ట్రెండ్ క్రియేట్ చేసింది.

'పెన్నీ' పాటను మామూలు లిరికల్ సాంగ్ మాదిరిగా కాకుండా స్పెషల్ మ్యూజికల్ ఆల్బమ్ గా రూపొందించారు SVP మేకర్స్. ఇందులో సూపర్ డాడ్-డాటర్ ద్వయం మహేష్ & సితార అదరగొట్టారు. ఇది సితార పాపకు ఫస్ట్ మ్యూజిక్ వీడియో.

తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ - స్టైలిష్ డ్యాన్స్ మూవ్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది సితార. తొలి పాట అయినా ఏమాత్రం బెరుకు లేకుండా మంచి ఈజ్ తో పెర్ఫార్మ్ చేసిందని చెప్పాలి. మహేశ్ బాబు సైతం తన కుమార్తె పెర్ఫార్మన్స్ కు ఫిదా అయ్యారు.

అయితే 'పెన్నీ' పాటలో సితార ను నటింపజేయాలనే ఆలోచన ఎవరిది? దీని కోసం మహేష్ - నమ్రత లను ఎలా ఒప్పించారు? ఎవరు ఒప్పించారు? అనే విషయాలపై తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ మాట్లాడారు.

'సర్కారు వారి పాట' సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా థమన్ శనివారం మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహేష్ డాటర్ సితార తో 'పెన్నీ' సాంగ్ చేయడంపై స్పందించారు.

''సితార రాక్ స్టార్. ఆమె బాడీలో మంచి స్వింగ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ లో సితార వీడియోలు కొన్ని మహేష్ గారి చూపించి.. 'పెన్నీ' సాంగ్ తనతోనే చేస్తే బావుటుందని రిక్వెస్ట్ చేశా. ఆ తర్వాత నమ్రత గారిని కలసి ఇదే చెప్పా. ఇద్దరూ ఓకే చెప్పారు'' అని తమన్ వివరించారు.

అంతేకాదు తాము పొద్దున్నుంచి సాంగ్ చేస్తుంటే.. సితార మాత్రం కేవలం 3 గంటల్లోనే సాంగ్ షూటింగ్ ఫినిస్ చేసిందని థమన్ తెలిపారు. ఫైనల్ కట్ చూసి మహేష్ బాబు చాలా హ్యాపీగా ఫీలయ్యారని సంగీత దర్శకుడు చెప్పుకొచ్చారు.