Begin typing your search above and press return to search.
దేవిశ్రీని కొట్టాలనే ఆ పాట చేశా-తమన్
By: Tupaki Desk | 16 April 2016 3:30 PM GMTతనకు పోటీగా ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ల గురించి భేషజం లేకుండా మాట్లాడేస్తుంటాడు తమన్. ముఖ్యంగా అతనెప్పుడూ దేవిశ్రీ ప్రసాద్ ప్రస్తావన తెస్తుంటాడు. అతడి పాటల్ని పొగుడుతుంటారు. తనకు దేవిశ్రీ పాటలు ఓ సవాల్ అని చెప్పుకోవడం అతడికే చెల్లింది. ఐటెం సాంగ్స్ చేయడంలో దేవికి దేవినే సాటి అని.. అతణ్ని చూసి తాను స్ఫూర్తి పొందుతుంటానని.. తనకు పోటీ ఇవ్వాలని చూస్తుంటానని అన్నాడు తమన్. తాను చేసిన ఐటెం సాంగ్స్ లో బెస్ట్ అనదగ్గ ‘సినిమా చూపిస్త మావ..’ పాటకు స్ఫూర్తి కూడా దేవీనే అంటున్నాడు తమన్.
‘‘మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య పోటీ ఉంటేనే మంచి ఔట్ పుట్ వస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘రింగ రింగా’ నాకు బాగా నచ్చింది. ఆ పాట విన్నాక దాన్ని మించిన ఐటెం సాంగ్ చేయాలనుకున్నా. అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ సినిమాకు పని చేసినపుడు ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకుని ఒక ఛాలెంజ్ లాగా తీసుకుని ‘సినిమా చూపిస్త మావా...’ పాట కంపోజ్ చేశా. దానికి చాలా మంచి పేరు వచ్చింది. అందుకే ఈ పోటీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటా’’ అని తమన్ చెప్పాడు.
తాను ఇప్పటికే చాలామంది స్టార్ హీరోలతో పని చేశానని.. ఐతే సూపర్ స్టార్ రజినీకాంత్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లతో పని చేయాలన్నది తన కల అని వెల్లడించాడు తమన్. తన పాటలు ఒకేలా ఉంటాయి అన్న విమర్శ గురించి మాట్లాడుతూ.. ‘‘ఒక పాట తయారవ్వాలంటే అందులో చాలా మంది పాత్ర ఉంటుంది. ప్రశంసలు.. విమర్శలు రెండూ కూడా అందరికీ దక్కుతాయి. అనేక పరిమితుల మధ్య పాటలు కంపోజ్ చేయాల్సి ఉంటుంది. ఐతే ఎక్కువ సినిమాలు చేయడం వల్ల నా మీద విమర్శలు వస్తున్నాయని అనుకోవడం లేదు. వారం వ్యవధిలో నేను మూడు పెద్ద ఆడియోలు రిలీజ్ చేసిన సందర్భాలున్నాయి. రభస - పవర్ - ఆగడు..ఈ మూడు సినిమాల ఆడియోలు వారం గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి. అందుకే అలా అనిపించి ఉండొచ్చు’’ అని తమన్ అన్నాడు.