Begin typing your search above and press return to search.
'కాపీ క్యాట్' అంటూ మళ్ళీ ఆడుకుంటున్నారుగా...!
By: Tupaki Desk | 6 Sep 2020 2:30 AM GMTప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ మాములు ఫార్మ్ లో లేడు. వరుసగా క్రేజీ మూవీస్ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తూ దుమ్ము లేపుతున్నాడు. సాంగ్స్ తో పాటు థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఇస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురములో' సినిమా అంతటి విజయం సాధించడానికి తమన్ అందించిన సంగీతం ఎంతగా దోహదపడిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'అల..' వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా పాటల సందడి మాత్రం ఆగడం లేదు. ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్'.. సాయి ధరమ్ తేజ్ 'సోలో బ్రతుకే సో బెటర్'.. రవితేజ 'క్రాక్'.. కీర్తి సురేష్ 'మిస్ ఇండియా' చిత్రాలకి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు థమన్. బాలయ్య - బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా.. నాని 'టక్ జగదేశ్'.. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా.. మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించిన 'వి' సినిమా ఓటీటీలో విడుదలైంది. అయితే 'వి' సినిమాతో మరోసారి కాపీ క్యాట్ థమన్ అనిపించుకుంటున్నాడు.
కాగా, థమన్ చాలా ఫాస్ట్ గా ట్యూన్స్ చేస్తాడనే పేరుంది. దాంతో పాటు కాపీ కొట్టడంలోనూ అతడికి తిరుగులేదని గతంలో చాలాసార్లు విమర్శలు వచ్చాయి. కాపీ క్యాట్ అంటే థమన్ అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాని - సుధీర్ బాబు కాంబోలో వచ్చిన 'వి' సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది సంగీతం అందించాడు. అయితే అతనికి వేరే కమిట్ మెంట్స్ ఉండటంతో బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వలేకపోయాడు. దీంతో 'అల..'తో సూపర్ ఫార్మ్ లో ఉన్న థమన్ ని 'వి' బీజీఎమ్ కోసం తీసుకున్నారు. అయితే ఈ బ్యాగ్రౌండ్ స్కోర్ కాపీ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. 'వి' బీజీఎమ్ తమిళ్ 'రాచ్చసన్' (తెలుగు 'రాక్షసుడు') ని పోలి ఉందని ఒరిజినల్ స్కోర్ తో కంపేర్ చేసి మీమ్స్ పెడుతున్నారు.
అంతేకాకుండా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' 6వ సీజన్ 10వ ఎపిసోడ్ లోని వైల్డ్ ఫైర్ బీజేఎం స్వాహా చేసారని విమర్శిస్తున్నారు. 'వి' క్లైమాక్స్ కి ముందు వచ్చే సీక్వెన్స్ లో తమిళ్ 'అసురన్' బ్యాగ్రౌండ్ స్కోర్ వాడారని కామెంట్స్ పెడుతున్నారు. దీనికి 'కింగ్' సినిమాలో పక్క భాషల్లో హిట్టైన ట్యూన్స్ ను దొబ్బేసి మ్యూజిక్ ఇచ్చే బ్రహ్మానందం ఫోటోకి థమన్ తల జత చేసి కాపీ క్యాట్ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో తమ ఫేవరేట్ హీరో సినిమాకి కాపీ ట్యూన్స్ ఇచ్చినా సినిమా రిలీజై హిట్ అయ్యే దాకా గుర్తు పట్టకుండా ఉండేలా కాపీ కొట్టమని ట్విట్టర్ లో కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా థమన్ కి 'అల..' సినిమాతో వచ్చిన గుర్తింపుని మొత్తం 'వి' బీజీఎమ్ లాగేసుకుందని థమన్ ఫ్యాన్స్ అంటున్నారు.