Begin typing your search above and press return to search.

బాలయ్యతో హ్యాట్రిక్ కాంబో.. దబిడి దిబిడే..!

By:  Tupaki Desk   |   8 Dec 2022 11:30 PM GMT
బాలయ్యతో హ్యాట్రిక్ కాంబో.. దబిడి దిబిడే..!
X
సినిమా హిట్ ఫార్ములా లో భాగమైన కాంబినేషన్ అనేది ఎన్నిసార్లు రిపీట్ చేసినా సరే బోర్ కొట్టదు. ప్రతిసారి ఆ కాంబో అంచనాలను పెంచుతూ సినిమాలు చేస్తుంటే ఆడియన్స్ కు అంతకుమించిన పండుగ వేరొకటి ఉండదు. ముఖ్యంగా స్టార్ హీరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అప్పట్లో మణిశర్మ, చిరంజీవి కాంబో ట్రెండ్ సెట్ చేసింది. చిరు సినిమా అయితే మణిశర్మ పూనకాలు వచ్చిన వాడినా సంగీతం అందిస్తాడు. ఇక ఇప్పుడు అలాంటి కాంబోనే ఒకటి సెట్ అయ్యింది. అది నందమూరి బాలకృష్ణ థమన్ కలయిక. అంతకుముందు కూడా డిక్టేటర్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు థమన్ ఆ తర్వాత అఖండకు వీరిద్దరు కలిశారు.

బోయపాటి శ్రీను మాస్ టేకింగ్ కి.. థమన్ మ్యూజిక్ యాడ్ అయ్యి అఖండని అదరగొట్టేలా చేసింది. ముఖ్యంగా ఆ సినిమాలో భం అఖండ అంటూ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్పీకర్లు బద్ధలయ్యేలా చేసింది. అఖండ ఊపు మీదే తన నెక్స్ట్ సినిమా వీర సింహారెడ్డికి థమన్ ని రిపీట్ చేశాడు బాలకృష్ణ. ఈ మూవీ మ్యూజిక్ కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ తో చేస్తున్నాడట థమన్.

ఈమధ్యనే వచ్చిన జై బాలయ్య సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు వీరి కాంబోలో మరో మూవీ కూడా ఫిక్స్ అయ్యింది. అనీల్ రావిపుడితో బాలయ్య బాబు చేస్తున్న NBK108వ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ ని ఫిక్స్ చేశారు. మాములుగా అయితే అనీల్ రావిపుడి సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తాడు.

కానీ బాలయ్య ఈ సినిమాకు దేవి కి బదులుగా థమన్ ని తీసుకోమని చెప్పాడు. ఆయన ఆర్డర్ మేరకు అనీల్ రావిపుడి ఈ సినిమాకు థమన్ ని తీసుకున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి ఇప్పుడు ఈ మూవీ ఇలా మొత్తం వరుసగా బాలయ్యతో హ్యాట్రిక్ సినిమాలు చేస్తున్నాడు థమన్.

వీర సింహారెడ్డి కూడా అంచనాలను అందుకుంటే బాలయ్య తన ప్రతి సినిమాకు థమన్ ని రిపీట్ చేస్తాడని చెప్పొచ్చు. ఓ పక్క మిగతా స్టార్ సినిమాలు చేస్తూనే బాలయ్య మూవీస్ కి ప్రత్యేకమైన మ్యూజిక్ అందిస్తూ నందమూరి ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు థమన్.

యువ హీరోల సినిమాలతో పాటుగా స్టార్ సినిమాలను చేస్తూ వస్తున్న థమన్ అప్పుడప్పుడు కాపీ అంటూ ఆడియన్స్ చేత టార్గెట్ అవుతున్నా సరే అవేవి పెద్దగా పట్టించుకోకుండా తన మ్యూజిక్ ఇస్తూ వస్తున్నాడు థమన్. బాలయ్యతో హ్యాట్రిక్ మూవీ చేస్తున్న థమన్ ఫ్యాన్స్ అంచనాలకు తగినట్టుగానే మ్యూజిక్ ఇవ్వాలని చూస్తున్నాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.