Begin typing your search above and press return to search.
త్రివిక్రమ్ పెట్టుకున్న నమ్మకాన్ని థమన్ నిలబెట్టుకుంటాడా..?
By: Tupaki Desk | 8 Jun 2022 7:39 AM GMTఇటీవల కాలంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సినిమాల మ్యూజిక్ పై ఫ్యాన్స్ సైడ్ నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటున్నా.. అందులో సంగీతం మాత్రం వాళ్ళను సాటిస్ఫై చేయడంలేదు.
కొన్ని చిత్రాల్లో పాటలు బాగున్నప్పటికీ.. బ్యాగ్రౌండ్ స్కోర్ - రీరికార్డింగ్ విషయంలో నిరాశ చెందుతున్నారు. ఇటీవల వచ్చిన 'సర్కారు వారి పాట' సైతం ఈ అంశాల్లో అభిమానులను మెప్పించలేకపోయింది.
పరశురాం పెట్లా దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూర్చారు. ఇంతకుముందు మహేష్ చేసిన 'దూకుడు' 'బిజినెస్ మ్యాన్' 'ఆగడు' వంటి సినిమాలకు థమన్ చార్ట్ బస్టర్స్ అందించారు.
చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ సూపర్ స్టార్ సినిమా కోసం తమన్ వర్క్ చేస్తుండటంతో ఫ్యాన్స్ మ్యూజిక్ పై హై ఎక్స్పేక్టేషన్స్ పెట్టుకున్నారు. అందులోనూ ఈమధ్య మ్యూజిక్ డైరెక్టర్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. SVP కి అదిరిపోయే ఆల్బమ్ ఇస్తారని భావించారు.
దీనికి తగ్గట్టుగానే 'కళావతి' 'పెన్నీ' 'మా మా మహేష్' వంటి సూపర్ హిట్ సాంగ్స్ కంపోజ్ చేశారు థమన్. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న బీజీఎమ్ & RR మాత్రం ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. అభిమానులు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని మహేష్ ను ట్యాగ్ చేసి మరీ చెప్పారు.
సర్కారు వారికి బలహీనమైన నేపథ్య సంగీతం అందించిన తర్వాత.. మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని అనిరుధ్ రవిచంద్రన్ లేదా మరేదైనా యువ సంగీత దర్శకుడికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని నెట్టింట ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
మహేష్ తన నెక్స్ట్ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న SSMB28 చిత్రానికి థమన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా ఫైనలైజ్ చేశారు మేకర్స్. ఈ మేరకు అధికారికంగా అనౌన్స్ మెంట్ కూడా ఇచ్చేసారు.
కానీ ఇప్పుడు SVP బ్యాగ్రౌండ్ స్కోర్ కు వచ్చిన రెస్పాన్స్ చూసి సంగీత దర్శకుడిని మార్చాలని మహేష్ భావించారట. కానీ త్రివిక్రమ్ మాత్రం SSMB28 కోసం అదనపు జాగ్రత్తలు తీసుకుంటానని మహేష్ కు హామీ ఇచ్చారట. థమన్ తన బెస్ట్ అవుట్ ఫుట్ ను అందించేలా చూస్తానని దర్శకుడు మాటిచ్చారట.
త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన 'అరవింద సమేత వీర రాఘవ' మరియు 'అల వైకుంఠపురములో' చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు తమన్. దీంతో కొన్నాళ్లపాటు తాను డైరెక్ట్ చేసే సినిమాలకు.. నిర్మించే చిత్రాలకు థమన్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని దర్శకుడు నిర్ణయించుకున్నారు.
'వకీల్ సాబ్' 'భీమ్లా నాయక్' చిత్రాల బాధ్యతలు థమన్ కు వచ్చేలా చేసింది త్రివిక్రమే. అలానే 'డీజే టిల్లు' 'వరుడు కావలెను' చిత్రాల్లోనూ భాగం చేశారు. ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాకి కూడా ఆయన్నే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. మరి త్రివిక్రమ్ పెట్టుకున్న నమ్మకాన్ని థమన్ నిలబెట్టుకుంటారో లేదో చూడాలి.