Begin typing your search above and press return to search.

డైరెక్టర్‌ ను కూడా వదలని థమన్‌

By:  Tupaki Desk   |   1 Sep 2021 4:54 AM GMT
డైరెక్టర్‌ ను కూడా వదలని థమన్‌
X
సంగీత దర్శకుడు థమన్‌ కు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ఇప్పటికే పలువురు హీరోలతో తన సంగీతంలో పాటలను పాడించాడు. హీరోలు పాట పాడటం వల్ల సినిమాకు ప్రత్యేక పబ్లిసిటీ రావడంతో పాటు ఆ పాట చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరు కూడా హీరో పాట పాడాడు అంటూ చర్చించుకోవడం వల్ల సినిమాకు ఒకింత ఎక్కువ పబ్లిసిటీ కూడా దక్కుతుంది. అందుకే థమన్ తన సినిమాల్లో అప్పుడప్పుడు అవసరం ఉన్నా లేకున్నా కూడా హీరోలతో పాటలు పాడించడం మనం చూస్తూనే ఉన్నాం. హీరోయిన్స్ కూడా ఈమద్య కాలంలో కొందరు తమ గొంతు విప్పడం జరిగింది. కాని దర్శకుడు గొంతు విప్పడం ను మాత్రం చాలా చాలా రేర్‌ గా చూస్తూ ఉంటాం.

దర్శకులు సహజంగా పాటలు పాడేందుకు ఆసక్తి చూపించరు. కాని సంగీత దర్శకుడు థమన్‌ పట్టుదల పట్టాడో లేదా ఆయనే ఆసక్తితో పాడాడో కాని దర్శకుడు శివ నిర్వాన తన తాజా చిత్రం టక్ జగదీష్ లో పాట పాడాడు. పాట అంటే అదో రెగ్యులర్ సాంగ్‌ లా కాకుండా సింపుల్‌ గా బిట్‌ సాంగ్ ను పాడాడు. బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ లో వచ్చే ఆ బిట్ సాంగ్ ప్రత్యేకంగా ఉంటుందని.. ఆంద్రా యాసతో ఉంటుందట. ఆంద్రాకు చెందిన శివ నిర్వాన ఆ యాసలో బాగా మాట్లాడుతాడు. అందుకే అతడే ఈ పాట పాడితే బాగుంటుంది అనే అభిప్రాయంను అందరు వ్యక్తం చేయడం థమన్ కూడా కాస్త ఆయన్ను బలవంతం చేయడం జరిగింది కనుక శివ ఓకే చెప్పాడు అనేది టాక్‌.

నాని హీరోగా ఐశ్వర్య రాజేష్‌ మరియు రీతు వర్మలు హీరోయిన్స్ గా నటించిన టక్‌ జగదీష్ విడుదలకు సిద్దం అయ్యింది. సెప్టెంబర్‌ 10వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టక్‌ జగదీష్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ను థియేటర్ల ద్వారా కాకుండా ఓటీటీ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. రికార్డు స్థాయిలో ఈ సినిమాకు గాను అమెజాన్ వారు చెల్లించి హక్కులు తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

కొన్ని విమర్శలు వచ్చినా కూడా తప్పని పరిస్థితుల్లో టక్ జగదీష్ ను ఓటీటీ లో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే సినిమా కు మంచి బజ్‌ ఉంది. ఈ సమయంలో సినిమా లో దర్శకుడు శివ నిర్వాన ఒక బిట్‌ సాంగ్‌ పాడాడు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సినిమా మరింత ఆకర్షణీయంగా ఉంటుంది అనే టాక్‌ వినిపిస్తుంది. నాని ఈ సినిమాలో చాలా విభిన్నంగా కనిపించబోతున్నాడు. జగపతి బాబు పాత్ర కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు.