Begin typing your search above and press return to search.
అల వచ్చిన క్రేజ్ అంతా 'వి'లా పోయే
By: Tupaki Desk | 5 Sep 2020 3:00 PM GMTగత ఏడాది చివరి నుండి కూడా 'అల వైకుంఠపురంలో' సినిమా పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటూనే ఉన్న థమన్ ఈ ఏడాది బిగ్గెస్ట్ సక్సెస్ ను ఆ సినిమాతో దక్కించుకున్నాడు. అల వైకుంఠపురంలో సినిమాలోని ప్రతి సినిమా కూడా యూట్యూబ్ లో వందల మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకుంది. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో ఏ మ్యూజిక్ ఆల్బం కూడా దక్కించుకోని బిలియన్ రికార్డును 'అల వైకుంఠపురంలో' ఆల్బం దక్కించుకుంది. అంతటి ఘనత దక్కించుకున్న థమన్ ఒక్కసారిగా తన గాలి తానే తీసుకున్నాడు.
నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'వి' సినిమా కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ అందించాడు. వి సినిమాకు కొన్ని కారణాల వల్ల కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను మాత్రమే అందించాడు. అది కాపీ అంటూ నెటిజన్స్ రుజువులతో సహా పోస్ట్ చేస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'రాక్షసుడు' సినిమా థీమ్ మ్యూజిక్ ను ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేసి 'వి'లో పెట్టాడు. తెలుగులో ఆ మ్యూజిక్ గురించి ఎవరికి తెలియదు అనుకున్నాడో లేదంటే ఓటీటీ లో విడుదల కాబోతున్న ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నాడో కాని ఆ బ్యాక్ గ్రౌండ్ థీమ్ ను వాడేశాడు.
తెలుగు ఆడియన్స్ ను తక్కువ అంచనా వేసిన థమన్ తప్పులో కాలేశాడు. అతడు ఇప్పుడు తీవ్రమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. మరీ ఇంత బ్లండర్ గా ఉన్నది ఉన్నట్లుగా ఎలా కాపీ కొట్టావయ్యా అంటూ ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ నువ్వు కాపీ కొట్టావు. కాని ఇది మాత్రం చిన్న పిల్లలు కూడా గుర్తు పట్టే విధంగా ఉంది అంటూ మీమ్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో థమన్ ను టార్గెట్ చేసి పోస్ట్ చేస్తున్న మీమ్స్ 'వి' కి మరింత డ్యామేజ్ చేస్తున్నాయి. ఇప్పటికే 'వి' సినిమాకు నెగటివ్ టాక్ రాగా థమన్ ఇష్యూతో సినిమా చూసేందుకు కూడా ప్రేక్షకులు ఆసక్తి చూడం లేదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
--