Begin typing your search above and press return to search.
తమన్ బాబుకి మెగా పరీక్షే
By: Tupaki Desk | 22 July 2016 5:30 PM GMTయువ సంగీత సంచలనం అనిపించుకున్న ఎస్ ఎస్ తమన్ కు.. ఇప్పుడు టైం అంత గొప్పగా ఏం నడవడం లేదు. వరుసగా భారీ ప్రాజెక్టులను హ్యాండిల్ చేసేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఇప్పుడు తక్కువ సినిమాలే ఉన్నాయి.
ఆగస్ట్ 5న విడుదల కానున్న శ్రీరస్తు శుభమస్తు.. ఆగస్ట్ 13న రిలీజ్ అవుతున్న తిక్క సినిమాలకు తమన్ సంగీతం అందించాడు. ఈ రెండు మినహాయిస్తే.. చేతిలో భారీ ప్రాజెక్టులేమీ లేని పరిస్థితి. ఒక వారం గ్యాప్ లో వస్తున్న ఈ రెండు సినిమాలు.. విచిత్రంగా మెగా ఫ్యామిలీ హీరోలవే. ఈ రెండు ప్రాజెక్టులు రెండు జోనర్ ల లోనివి కావడం విశేషం. సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తిక్క మూవీ కంప్లీట్ మాస్ మూవీ కాగా.. అల్లు శిరీష్ మూవీ శ్రీరస్తు శుభమస్తు అయితే కంప్లీట్ ఫ్యామిలీ మూవీ.
ఒక వారం గ్యాప్ లో రెండు పూర్తి డిఫరెంట్ ఆల్బమ్స్ విడుదల కావడం చెప్పుకోదగ్గ విషయం. ఈ రెండు చిత్రాలకు ఇంకా ఆడియో ఫంక్షన్ చేయలేదు. ఆ వేడుకలు కూడా వరుసగానే జరిగే ఛాన్స్ ఉంది. తిక్క.. శ్రీరస్తు శుభమస్తు ఈ రెండింటిలో ఏ జోనర్ క్లిక్ అయినా సరే.. తమన్ కి మళ్లీ అవకాశాలు వెల్లువెత్తడం ఖాయంగా చెప్పచ్చు. మరి తమన్ ఈ మెగా పరీక్షను పాస్ అవుతాడో లేదో?