Begin typing your search above and press return to search.

త‌మ‌న్ జోరుని ఆప‌డం ఇక ఎవ‌రి వ‌ల్ల‌కాదు!

By:  Tupaki Desk   |   26 Feb 2022 8:00 AM IST
త‌మ‌న్ జోరుని ఆప‌డం ఇక ఎవ‌రి వ‌ల్ల‌కాదు!
X
కంటెంట్ ఎలా వున్నా.. సీన్ లు ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా వున్నా అదిరిపోయే స‌న్నివేశాలు వున్నా అవి ఎలివేట్ కావాల‌న్నా.. వాటిని ఆడియ‌న్స్ ఫీల‌వ్వాల‌న్నా.. అందుకు త‌గ్గ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా అవ‌స‌రం. అలాంటి నేప‌థ్య సంగీతం కుదిరిని ప్ర‌తీ స‌న్నివేశం మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా జ‌నాల‌ని ఇంప్రెస్ చేస్తుంది.

అంతే కాకుండా సినిమా విజ‌యానికి ప్ర‌ధాన భూమిక‌ని పోషిస్తుంటుంది. గ‌త కొన్ని నెల‌లుగా అలాంటి సంగీతాన్నే అందిస్తూ వావ్ అనిపిస్తున్నాడు త‌మ‌న్‌. ప్ర‌తీ చిత్రాన్ని త‌నదైన మార్కు బ్యాగ్రౌండ్ స్కోర్ తో మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా ఎలివేట్ చేస్తూ శ‌భాష్ అనిపించుకుంటున్నాడు.

త్రివిక్ర‌మ్ - అల్లు అర్జున్ ల క‌ల‌యిక‌లో 2020లో వ‌చ్చిన `అల వైకుంఠ‌పుర‌ములో` ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌వ‌డానికి, ఈ చిత్ర ఆడియో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డానికి త‌మ‌న్ త‌న సంగీతంతో ప్ర‌ధాన పాత్ర పోషించాడు. దేశ వ్యాప్తంగా ఈ చిత్ర గీతాల‌కు అనూహ్య ఆద‌ర‌ణ ల‌భించి సినిమా వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే.

అప్ప‌టి త‌మ‌న్ అంటే భారీ క్రేజ్ ఏర్ప‌డింది. త‌న‌తో సినిమ చేయాల‌ని చూడ‌ని హీరో లేడు. `అల వైకుంఠ‌పుర‌ములో` త‌రువాత నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన `అఖండ‌` చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించాడు.

అఖండ పాత్ర‌లో బాల‌కృష్ణ ప‌రిచ‌య స‌న్నివేశాల‌తో పాటు సినిమాలో `అఖండ‌` పాత్ర క‌నిపించిన ప్ర‌తీ స‌న్నివేశాన్ని త‌మ‌న్ త‌న బీజిఎమ్స్ తో ఎలివేట్ చేసిన తీరు రోమాంచితుల్ని చేసింది. అంతే కాకుండా ఈ సినిమాకు నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచి త‌మ‌న్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇండ‌స్ట్రీలో అత‌ని పేరు మారుమ్రోగిపోయింది. ప్రేక్ష‌కులు కూడా త‌మ‌న్ ని ఆకాశానికి ఎత్తేశారు. ఇప్ప‌డు మ‌రోసారి త‌మ‌న్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన క్రేజీ చిత్రం `భీమ్లానాయ‌క్‌`. మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేశారు. సాగ‌ర్ కె. చంద్ర తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుద‌లై సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ సినిమా సాంగ్స్ ఇప్ప‌టికే సూప‌ర్ హిట్ అయి నెట్టింట వైర‌ల్ అయ్యాయి.

ఈ రోజు ఉద‌యం సినిమా చూసిన వారంతా త‌మ‌న్ నేప‌థ్య సంగీతంతో చంపేశాడ‌ని.. ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం ప్ర‌ధాన బ‌లంగా నిలిచింద‌ని అత‌నిపై నెటిజ‌న్స్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

మార్నింగ్ షో నుంచే త‌మ‌న్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం మొద‌లైంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త‌మ‌న్ `భీమ్లానాయ‌క్‌` రిలీజ్ త‌రువాత మాట్లాడ‌తాన‌ని వెల్ల‌డించాడు. అంటే త‌న సంగీతంతో మాట్లాడ‌తాన‌ని ఇండైరెక్ట్ గా చెప్పాడ‌ని ఇప్పుడు ఫ్యాన్స్ అంతా అంటున్నారు.

`భీమ్లానాయ‌క్‌` సినిమాకు త‌మ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌డంతో ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అత‌న్ని ఇప్ప‌డు ఆకాశానికి ఎత్తేస్తూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. త‌మ‌న్ ని చూసిన వారంతా త‌మ‌న్ ని జోరుని ఆప‌డం ఇక ఎవ‌రి వ‌ల్ల‌కాదు