Begin typing your search above and press return to search.
కాపీ ఆరోపణలపై తమన్ జవాబిది
By: Tupaki Desk | 30 Sep 2018 4:15 AM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తమన్ పాటలపై కాపీ ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. ఐతే ఇప్పటిదాకా వచ్చిన ఆరోపణలు ఒకెత్తయితే.. ‘అరవింద సమేత’లోని పాటల విషయంలో జరిగిన రచ్చ మరో ఎత్తు. ఇప్పుడు సోషల్ మీడియా బాగా విస్తృతం అయిపోయిన నేపథ్యంలో ఈ సినిమాలోని రెండు పాటలపై పెద్ద రభసే జరిగింది. ‘అనగనగనగా’.. ‘పెనివిటి’ సాంగ్స్ వేరే పాటల్ని పోలి ఉండటంతో సోషల్ మీడియాలో జనాలు తమన్ ను ఆటాడేసుకున్నారు. పెద్ద ఎత్తున మీమ్స్ తయారు చేసి అతడిని ట్రోల్ చేశారు. ఐతే దీనిపై ఇన్నాళ్లూ మౌనం వహించిన తమన్.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో విమర్శకులకు బదులిచ్చాడు. అతను ఏమన్నాడంటే..
‘‘అరవింద సమేతలోని పాటలకు వేరే పాటలతో పోలిక ఉందని జనాలు చెప్పే వరకు నాకు తెలియదు. దీన్ని బట్టి నాకో విషయం అర్థమైంది. నాకో శైలి ఉంది. నా పాటలు ఒక స్టయిల్లో ఉంటాయని. అసలు రాగాలన్నీ ఒకేలా ఉంటాయి. కాపీ అనడం తప్పు. నా కంపోజిషన్ అలానే ఉంటుంది. అది నా స్టైల్. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఏ సంగీత దర్శకుడిని తీసుకున్నా.. వాళ్లకో స్టైల్ ఉంటుంది. మణిశర్మ గారి పాటలు ఒకలా ఉంటాయి. కోటిగారు - ఎస్ ఏ రాజ్‌కుమార్ గారు - దేవిశ్రీ ప్రసాద్.. ఇలా ఒక్కొక్కరివి ఒకలా ఉంటాయి. నేను మాట్లాడను కదా అని నన్ను పదే పదే విమర్శిస్తే నేనేం చేయగలను. ఇలా కామెంట్ చేయడం ఒకరి బతుకు తెరువు. బతకనివ్వండి. అలాంటి వాళ్లు హ్యాపీగా ఉంటే ఓకే. నాకేం నష్టం లేదు. నా దర్శక నిర్మాతలు.. హీరోలు నన్ను నమ్ముతున్నారు. విమర్శల వల్ల నాకు పోయేదేం లేదు. అలాగని పొగిడినా నాకు పెరిగేదేమీ లేదు’’ అని తమన్ కుండబద్దలు కొట్టాడు.