Begin typing your search above and press return to search.
కాపీ భారాన్ని డైరెక్టర్ల పై మోపిన తమన్
By: Tupaki Desk | 30 Sep 2015 7:30 PM GMTమ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్ థమన్ ఆనతికాలంలోనే ఫేమస్ అవ్వడమేకాక స్టార్ హీరోల సినిమాలకు పనిచేసే ఛాన్స్ కొట్టేశాడు. అయితే ఎంత వేగంగా ఎదిగారో అంతే రేంజ్ లో విమర్శలను సైతం తమన్ ఎదుర్కున్నాడు. డబ్బారేకుల సుబ్బారాయుడంటూ, కాపీ క్యాట్ అంటూ రకరకాల తొకలను తగిలించుకున్నాడు.
తమన్ కాపీ కొడతాడన్న మాట వాస్తవమే. ఈ కాపీ క్రమంలో కొన్ని క్రియేటివ్ ప్రోగ్రామ్స్ కూడా తెరకెక్కాయి. అయితే తాను కాపీ కోడతానన్న విషయాన్ని ఒక ఇంటర్వ్యూ లో స్వయంగా తమనే ఒప్పుకున్నాడు. మిగితా వారిలా తెలివిగా కాపీ కొట్టలేనని, స్పూర్తి పొంది ట్యూన్స్ ని ఇచ్చి దొరికిపోతానని చమక్కులేసాడు.
అయినా ఒక ట్యూన్ బయటకొచ్చే ముందు కొన్ని వందల మంది చిత్ర బృందం వింటారని, వారెవరికీ ఇది కాపీ ట్యూన్ అని తెలియదా అని ఎదురుప్రశ్నించాడు. కొన్ని సార్లు కాపీ కోడతున్నామని తెలిసినా దర్శకులు, నిర్మాతలు పెట్టె ప్రెజర్ వలన తప్పట్లేదని చెప్పుకొచ్చాడు. ఒక సినిమాలో ఐదు హిట్ సాంగ్స్ అందించినవాడికి ఒక పాట కాపీ కొట్టాల్సిన అవసరం లేదని తెలివిగా మళ్ళించాడు.