Begin typing your search above and press return to search.

SS థమన్ డప్పుకు సాగిల పడిన శతకం!

By:  Tupaki Desk   |   2 Nov 2018 4:29 AM GMT
SS థమన్ డప్పుకు సాగిల పడిన శతకం!
X
థమన్ జోరు మామూలుగా లేదు. బ్యాట్ తో గ్రౌండ్ లో దిగిన సచిన్ టెండూల్కర్.. విరాట్ కొహ్లి లాంటి వాళ్ళు సెంచరీ బాదడమే పనిగా పెట్టుకున్నట్టు.. ఈయన కూడా డప్పుతో 100 టార్గెట్ చేసినట్టున్నాడు. జస్ట్ 10 ఏళ్ళు.. అంతే. 100 సినిమాలు కంప్లీట్ చేశాడు. ఎన్టీఆర్ చిత్రం 'అరవింద సమేత' తో ఈ సెన్సేషనల్ రికార్డు సాధించాడు.

ఇప్పటివరకూ 100 సినిమాలకు సంగీతం చాలామంది అందించారు గానీ థమన్ భయ్యా లాగా ఫాస్టెస్ట్ సెంచరీ ఎవ్వరూ చెయ్యలేకపోయారు. సాధారణంగా సంగీత దర్శకులకు ఈ ఫీట్ సాధించదానికి కనీసం రెండు మూడు దశాబ్దాల సమయం పడుతుందట.. కానీ పదేళ్ళలో ఈ ఫీట్ సాధించాడంటే మనం థమన్ స్పీడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. డ్రమ్మర్ గా తన కెరీర్ మొదలుపెట్టిన థమన్ కీరవాణి.. మణిశర్మ.. ఎఆర్ రెహమాన్ లాంటి దిగ్గజాల వద్ద పనిచేశాడు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారాడు. రవితేజ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కిన 'కిక్' తో థమన్ కు కెరీర్ లో ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అప్పటినుండి థమన్ జోరు మరింతగా పెరిగింది.

అన్నట్టు ఇలాంటి భీభత్సమైన రికార్డు సాధించిన థమన్ డెబ్యూ ఫిలిం ఏదో తెలుసా? 'భీభత్సం'! ఇదిలా ఉంటే థమన్ దాదాపుగా సౌత్ ఇండియన్ భాషలన్నీ కవర్ చేయడమే కాకుండా హిందీ లో కూడా సంగీతం అందించాడు. 'గోల్మాల్ అగైన్' తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో థమన్ ఇచ్చిన సంగీతానికి ప్రశంసలు అందుకున్నాడు. అంతే కాదు రీసెంట్ గా 'షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్ 1' బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అందరినీ థ్రిల్ చేశాడు. మరి ఇంత ఘనత సాధించిన థమన్ భయ్యాకు జై కొట్టరా?