Begin typing your search above and press return to search.

మాస్ రాజాతో తొమ్మిదోసారి..

By:  Tupaki Desk   |   21 Feb 2016 5:57 AM GMT
మాస్ రాజాతో తొమ్మిదోసారి..
X
ఈ తరంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక హీరోతో నాలుగైదు సినిమాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిందే. అలాంటిది ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్.. ఒక స్టార్ హీరోతో తొమ్మిదో సినిమా చేయబోతున్నాడు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాగా.. ఆ హీరో రవితేజ. మాస్ రాజా కొత్త సినిమాకు తమనే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు. డెబ్యూ డైరెక్టర్ చక్రి తోలేటి ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాకు ‘రాబిన్ హుడ్’ అనే టైటిల్ అనుకుంటున్నారు.

రవితేజ - తమన్ కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా కిక్. ఆ సినిమా మంచి మ్యూజికల్ హిట్ కావడంతో తమన్ జాతకమే మారిపోయింది. వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్లో ఆంజనేయులు - మిరపకాయ్ - వీర - నిప్పు - బలుపు - పవర్ - కిక్-2 సినిమాలు వచ్చాయి. వీటిలో మెజారిటీ సినిమాలు మ్యూజికల్ గా మంచి విజయమే సాధించాయి.

‘బెంగాల్ టైగర్’ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో ‘ఎవడో ఒకడు’ చేయాల్సిన మాస్ రాజా.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. ‘రాబిన్ హుడ్’ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తాడని సమాచారం. దీని తర్వాత రవితేజ ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలూ ఈ ఏడాదే పూర్తి చేసేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు మాస్ రాజా.