Begin typing your search above and press return to search.
RT66: ఫేవరెట్ ని వదలని మాస్ రాజా
By: Tupaki Desk | 3 Nov 2019 11:43 AM GMTకొంత మంది హీరోలు మ్యూజిక్ డైరెక్టర్లను రీప్లేస్ చేసేందుకు ఏమాత్రం ఇష్టపడరు. అలా ఇష్టపడని హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ముందు వరుసలో ఉంటాడు. రవితేజ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లకు సంగీతం అందించిన థమన్ అంటే పిచ్చ సెంటిమెంట్. అందుకే పదే పదే రాజా సినిమాలకు థమనే రిపీటవుతుంటాడు. మరోసారి సేమ్ సీన్.
ప్రస్తుతం రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న RT66 చిత్రానికి థమన్ ని ఫైనల్ చేశారు. గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇంతకుముందు రవితేజ- గోపిచంద్ మలినేని కాంబినేషన్ మూవీ `బలుపు`కి థమన్ సంగీతం అందించాడు. ఆ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. రాజా కోసం మరోసారి శ్రుతిహాసన్ ని బరిలో దించుతున్నారు.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మాస్ రాజాతో మాస్ దర్శకుడు మాస్ మ్యూజిక్ డైరెక్టర్ కలిసారు. మునుముందు ఎలాంటి సెన్సేషన్స్ కి తావిస్తారో చూడాలి. ఇక థమన్ ప్రస్తుతం రీప్లేస్ మెంట్ కి అవకాశం ఇవ్వకుండా ఆల్టర్నేట్ అన్నదే లేకుండా వరుసగా క్రేజీ ప్రాజెక్టుల్ని ఖాతాలో వేసుకుంటున్నాడు. అటు బన్ని అల వైకుంఠపురములో చిత్రానికి చార్ట్ బస్టర్ మ్యూజిక్ ని ఇస్తున్నాడు. ఆ క్రమంలోనే వెంటనే మాస్ రాజా రూపంలో మరో ఛాన్స్ అందుకున్నాడు. ఇస్పీడ్ చూస్తుంటే మరో ఐదారేళ్లు థమన్ టైమ్ కంటిన్యూ అయ్యేట్టే ఉంది.