Begin typing your search above and press return to search.
ఆ పాట తమన్ జీవితాన్నే మార్చేస్తుందా?
By: Tupaki Desk | 10 Sep 2015 4:03 PM GMTఇండస్ట్రీలో వేగవంతంగా 50 సినిమాలకు పనిచేసిన రికార్డుని ఎస్.ఎస్ తమన్ సొంతం చేసుకున్నాడు. తక్కువ బడ్జెట్ కే అందుబాటులో వుండడం, ఫాస్ట్ గా ట్యూన్ లను అందించడంతో పూరి వంటి అగ్ర దర్శకులు సైతం తమన్ నే ఎన్నుకునేవారు. అయితే ఒకానొక సమయంలో వరంగా మారిన ఆ వేగమే ఇప్పుడు శాపంగా మిగిలింది. తమన్ గత చిత్రాలేవి అలరించే స్థాయిలో లేకపోతున్న తరుణంలో అతని మనుగడే ప్రశ్నార్ధకంగా మారింది.
అడపాదడపా హిట్లు కొడుతున్నా కన్సిస్టెన్సీ విషయంలో తమన్ వేనుక వరసలో వున్నాడు. కీరవాణి - దేవి శ్రీ ప్రసాద్ - మిక్కీ జె మేయర్ - కళ్యాణి కోడూరి - శేఖర్ చంద్ర ల హిట్ పెర్సెంట్ తో పోల్చుకుంటే తమన్ ఎక్కడో వున్నాడు. ఇక కొత్త వారినుండి సైతం అతనికి ముప్పు పొంచి వుంది. ఈ క్రమంలో ప్రస్తుతం తమన్ చేతిలో వున్న బ్రూస్ లీ కెరీర్ కే కీలకంగా మారింది. ఆ సినిమాకి మెగాస్టార్ రాకతో తమన్ భాద్యత మరింతపెరిగింది.
ఈ సినిమాలో చిరు ఒక పాటకు చిందేయనున్న విషయం తెలిసినదే. ఈ పాటను తమన్ చాలెంజింగ్ గా తీసుకుని కంపోజ్ చేస్తున్నట్టు సమాచారం. 'శంకర్ దాదా MBBS .. ఊ హా..ఊ హా' అన్న ఒక్క పాటతో లైం లైట్ లో నుండి స్టార్ లైట్ లోకి వెళ్ళిపోయిన దేవీ ఇప్పటికీ మెగాస్టార్ ముందు అదే ట్యూన్ ని హం చేస్తాడు. అలాంటి ట్యూన్ గనుక తమన్ ఇవ్వగలిగితే తమన్ ఇంక కెరీర్ లో తిరిగి చూసుకోనవసరంలేదని ప్రత్యేకంగా చెప్పాలా.