Begin typing your search above and press return to search.

వాళ్ళను ప్రశ్నించరేం అంటున్న థమన్ భయ్యా!

By:  Tupaki Desk   |   14 Oct 2018 6:54 AM GMT
వాళ్ళను ప్రశ్నించరేం అంటున్న థమన్ భయ్యా!
X
ఇదంతా పాడు లోకం. "వినే టైము చెప్పే మనిషి వల్ల….. విషయం విలువే మారిపోతుంది." మరి విషయం సేమ్ సేమ్ అయినప్పుడు అదెందుకు మారుతుంది? అందుకే జనాలకు లాజిక్కులు కాదు మ్యాజిక్కులు మాత్రమే కావాలని గురూజీ మరో సందర్భంలో శెలవిచ్చారు. ఇంతకీ ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే థమన్ భయ్యా 'కాపీ' అన్న పదం వినగానే కోప్పడడం వల్ల.

"వినే ట్యూను.. ఆ ట్యూన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ వల్ల... ట్రోలింగ్ ఇంపాక్టే మారిపోతుంది." దాదాపుగా థమన్ ఇలాంటి అభిప్రాయం వెలిబుచ్చాడు. "ట్యూన్స్ కాపీ కొట్టాడని నన్నే ఎందుకు టార్గెట్ చేస్తారో అర్థం కాదు.. నన్ను టార్గెట్ చేసినట్టు కీరవాణి.. దేవీ శ్రీ ప్రసాద్.. ఏఆర్ రెహమన్‌ గురించి రాయగలరా? వారికి అంత దమ్ము ఉందా?" అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలా టార్గెట్ చేసి రాయడం వల్ల జీవితం నాశనం అయ్యే అవకాశం ఉందని అన్నాడు. అయినా దర్శకులకు నిర్మాతలకు తన గురించి తెలుసని చెప్పాడు. తనే కనుక కాపీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే 60 సినిమాలకు సంగీతం అందించగలిగేవాడినా అంటూ ప్రశ్నించాడు.

'బిజినెస్ మ్యాన్' సినిమా లో పిల్లా చావ్ పాటను పూరి జగన్నాధ్ పెట్టమంటేనే పెట్టడం జరిగిందని ఈ విషయంలో ఆల్రెడీ పూరిగారు వివరణ ఇచ్చారని చెప్పాడు. తను సాఫ్ట్ టార్గెట్ కాబట్టి తననే టార్గెట్ చేస్తున్నారని అన్నాడు. తన మీద మీమ్స్.. ట్రోలింగ్ చేయడం మంచిది కాదన్నాడు. అయినా ఇలాంటివి పట్టించుకోనని తన పనిపైనే ఫోకస్ చేస్తానని తెలిపాడు.

అంతా బాగానే ఉంది గానీ దేవీ పై..రెహమాన్.. కీరవాణి పై కాపీ విమర్శలు లేవని అన్నాడు. ఇక్కడే థమన్ భయ్యా పొరపాటుబడ్డాడు. గూగులమ్మ ను కాస్త ఓపిగ్గా అడిగితే అందరి కాపీ పురాణాలు.. ఒరిజినల్స్ తో సహా బయటపెడుతుంది. కాకపోతే వాళ్ళు ఆ విమర్శలపై స్పందించకుండా ఊరుకుంటారు కాబట్టి పెద్ద న్యూస్ కాదు. థమన్ కాస్త ఎమోషనల్ అవుతాడు కాబట్టి న్యూస్ అవుతుంది అంతే..!