Begin typing your search above and press return to search.
మహేష్ కత్తిపై తమ్మారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
By: Tupaki Desk | 13 Jan 2018 7:11 AM GMTఇటీవల కాలంలో మరే వివాదం సాగనంతగా పవన్ అభిమానులు వర్సెస్ కత్తి మహేశ్ వివాదం సా..గుతోంది. ఎంతకూ ఎవరూ తగ్గని రీతిలో ఈ ఇష్యూనడుస్తోంది. పవన్ పై అదే పనిగా విమర్శలు చేయటం.. ఆయన తీరును అన్ని కోణాల్లో తప్పు పట్టటంతో పాటు.. చర్చల పేరుతో మీడియాలో తరచూ దర్శనమివ్వటం ద్వారా భారీగా ప్రచారం పొందారు.
నిజానికి ఒక హీరో అభిమానులు వర్సెస్ ఒక ఫిలిం క్రిటిక్ మధ్య పంచాయితీకి మీడియా పెద్ద ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ.. కత్తి మహేశ్ టార్గెట్ చేసింది పవన్ కల్యాణ్ కావటంతో కొన్ని ఛానళ్లు అదే పనిగా ఈ ఇష్యూను తెర మీదకు తీసుకొస్తున్నాయి.
కత్తి ఎపిసోడ్‌పై ఇప్పటికే పలువురు పలు వ్యాఖ్యలు చేయటం.. దీనికి కౌంటర్ గా కత్తి మళ్లీ రియాక్ట్ కావటం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే వీరి ఇష్యూలో తలదూర్చిన మాటల రచయిత కోన వెంకట్ ఈ ఇష్యూను ఈ నెల 15 నాటికి తేల్చేస్తానని చెప్పటం తెలిసిందే. దీంతో.. ఈ వివాదానికి కోన వెంకట్ పుల్ స్టాప్ పెడతారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఇటీవల పవన్ నటించిన 'అజ్ఞాతవాసి" ఫలితం వేరేలా ఉండటంతో పవన్ ఫ్యాన్స్ సైలెంట్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. ఎంతకూ తగ్గని మహేశ్ కత్తి మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సినీ రంగ ప్రముఖులు తమ్మారెడ్డి భరద్వాజ. టాలీవుడ్ లో అందరితోనూ చక్కటి సంబంధాలతో పాటు.. పెద్ద మనిషిగానూ.. విలువలు పాటిస్తారన్న పేరు ఆయన సొంతం. అలాంటి తమ్మారెడ్డి తాజాగా కత్తి ఎపిసోడ్ మీద ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
కత్తి మహేశ్ తన మాటల యుద్ధాన్ని ఆపేయాలని లేకుంటే దాని పరిణామాలు మరింత ఇబ్బందికరంగా ఉంటాయన్నారు. తాను రోజూ మాట్లాడుతున్నట్లు చెప్పారు.
మరోవైపు ఈ రెండు వర్గాలకు మధ్య రాజీ చేసేందుకు మాటల రచయిత కోన వెంకట్ ప్రయత్నిస్తున్నారు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడిన తమ్మారెడ్డి.. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుందని.. అభిప్రాయాన్ని పంచుకునే అవకాశం ఉందన్నారు. ఒక అభిప్రాయాన్ని వెల్లడించిన తర్వాత వచ్చే స్పందనల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
తాను కూడా చిరంజీవి.. బాలకృష్ణ.. పవన్ కల్యాణ్.. మహేశ్ బాబులను తాను సైతం చాలాసార్లు విమర్శించానని.. అదే రీతిలో కత్తి మహేశ్ కూడా విమర్శించొచ్చని.. కానీ..తన విమర్శలకు పవన్ అభిమానులు వెంటనే రియాక్ట్ కావటం సరైన చర్య కాదన్నారు. పవన్ అభిమానులు తిట్టినంతనే తిరిగి తిట్టాలనుకోవటం సరికాదన్నారు. ఒకరిపై ఒకరు తిట్టుకోవటం అదే పనిగా కొనసాగుతుండటంతో సమస్య మరింత ముదురుతోందన్నారు. ఇలా సాగుతుంటే సమస్యకు పరిష్కారం లభించదన్నారు.
గడిచిన నాలుగు నెలలుగా పవన్ కల్యాణ్.. అభిమానలు.. కత్తి మహేశ్ కారణంగా టైం వెస్ట్ అవుతుందన్నారు. తాను లేవనెత్తిన అంశాలపై పవన్ కల్యాణ్ మాట్లాడాలని డిమాండ్ చేసే హక్కు మహేశ్ కు ఉందని.. కానీ.. ఆ విషయం మీద స్పందించాల్సిన అవసరం ఉందో? లేదో? అన్నది వారికే తెలుసన్నారు.
మహేశ్ లాంటి వ్యక్తుల అవసరం సమాజానికి ఉందన్న తమ్మారెడ్డి.. ఈ వివాదంతో కత్తి మరోలా మారాడన్నారు. ఈ వివాదాల జోలికి అతడు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఆర్థికంగా కాకున్నా.. మహేశ్ తన బతుకు తాను విలువలతో బతుకుతున్నాడని.. కానీ ఈ రోజున ఆ విలువల్ని పోగొట్టుకుంటున్నాడన్నారు.
తిడితే తిట్టారని పవన్ అభిమానుల్ని పట్టించుకోకుండా ఉంటే.. వారం వ్యవధిలో ఈ ఇష్యూ క్లోజ్ అవుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తమ్మారెడ్డి. ఈ ఇష్యూను తాను ఎలా పుల్ స్టాప్ పెడతానన్న తమ్మారెడ్డి.. మహేశ్ ను కొట్టనా? పవన్ కల్యాణ్ స్పందించాలన్న మాటను ఆయన దగ్గరకు వెళ్లి చెప్పనా? అంటూ ప్రశ్నించిన తమ్మారెడ్డి.. తాను రాజీ చేయలేనన్నారు. నిజానికి ఒక తమ్మారెడ్డి.. కోన వెంకట్ కారణంగా ఈ ఇష్యూ క్లోజ్ అవుతుందని అనుకోవటం అత్యాశే అవుతుంది. ఎందుకంటే ఈ రోజు ఇష్యూ క్లోజ్ అయినా.. రెండు రోజులయ్యాక మహేశ్ కత్తి మళ్లీ తన విమర్శల్ని పోస్ట్ చేస్తే.. మళ్లీ ఇలాంటి పరిస్థితే ఎదురుకావటం ఖాయం. మొత్తంగా చూస్తే.. పవన్ అభిమానులు వర్సెస్ మహేశ్ కత్తి ఎపిసోడ్ లో మిగిలిన వారంతా సైలెంట్ గా ఉండి.. జరుగుతున్నదంతా కళ్లప్పగించి చూస్తున్న వేళ.. వారికి భిన్నంగా ఇద్దరు ప్రముఖులు రాజీ చేసే ప్రయత్నం చేయటం మెచ్చుకోవాల్సిందేనని చెప్పక తప్పదు.