Begin typing your search above and press return to search.

తందానె తందానె: సింపుల్ గా మ్యాజిక్ చేసిన దేవీ

By:  Tupaki Desk   |   3 Dec 2018 10:54 AM GMT
తందానె తందానె: సింపుల్ గా మ్యాజిక్ చేసిన దేవీ
X
బోయపాటి శ్రీను దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'వినయ విధేయ రామ' సినిమా నుండి 'తందానె తందానె' అంటూ సాగే ఫస్ట్ సింగిల్ ను ఫిలిం మేకర్స్ కాసేపటి క్రితం విడుదల చేశారు. ముందుగా చెప్పినట్టే ఇదో ఫ్యామిలీ సాంగ్. ఈ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడనే సంగతి తెలిసిందే కదా.

ఈ పాటకు సాహిత్యం అందించింది శ్రీమణి. ఈ పాటను పాడిన సింగర్ ఎం ఎల్ ఆర్ కార్తికేయన్. 'తందానె తందానె..తందానె తందానె.. చూశారా ఏ చోటైనా ఇంతానందాన్నె.. తందానె తందానె..తందానె తందానె కన్నారా ఎవరైనా ప్రతిరోజూ పండగనే' అంటూ ఎంతో అందమైన పదాలతో శ్రీమణి పొందికగా ఒక మాలగా కూర్చగా దేవీ దానికి తగ్గట్టు తన స్టైల్లో టిపికల్ మెలోడీ ట్యూన్ ఇచ్చాడు. టిపికల్ ఎందుకంటే.. బీట్ లో మెలోడీ ని మిక్స్ చేయడం ఒక్క రాక్ స్టార్ కు మాత్రమే సొంతం. ఇక ఈ పాటను కార్తికేయన్ ఓ సెలెబ్రేషన్ లా పండగ వాతావరణాన్ని ప్రతిబింబించే గొంతుతో శ్రావ్యంగా పాడాడు. ఈ పాట ఎలా ఉంది అని ఒక్క ముక్కలో చెప్తే సింపుల్ అండ్ బ్యూటిఫుల్.

మొదటి సారి వింటే.. పాత దేవీ హిట్ సాంగ్స్ స్టైల్ లో అనిపిస్తుంది కానీ.. ఓ నాలుగైదు సార్లు వింటే మీరు పాట మాయలో పడడం.. తందానె తందానె అని హమ్ చేయడం ఖాయమే. ఈ పాట సింప్లిసిటీ కి తోడు విజువల్స్ కూడా గుడిలో ట్రెడిషనల్ డ్రెస్సుల్లో స్వామివారి పల్లకీని చరణ్ మోయడం చూస్తుంటే ఓ మంచి ఫీల్ వస్తోంది. ఏదేమైనా ఫస్ట్ పాటతోనే అందరినీ దేవీ ఫ్లాట్ చేసినట్టే. ఇంకెందుకాలస్యం.. ఒక లుక్కేసి మీరూ చెర్రీతో కలిసి తందానె తందానె అనండి.