Begin typing your search above and press return to search.
వీడియో ప్రోమో : విధేయ ఫ్యామిలీ ఆనందం
By: Tupaki Desk | 2 Jan 2019 10:46 AM GMTసంక్రాంతి సినిమాల్లో ఫుల్ మాస్ మసాలాతో వస్తున్న వినయ విధేయ రామకు ఇప్పటికే ట్రైలర్ రూపంలో కావల్సినంత బజ్ వచ్చేయగా పాటల తాలూకు వీడియో ప్రోమోలు అంచనాలు పెంచడానికి వదులుతున్నారు. ఫ్రెష్ గా ఇందులో ఫ్యామిలీ సాంగ్ తందానే తందానే వీడియోను రిలీజ్ చేశారు. ఇంతకు ముందు చూసిన లిరికల్ బిట్స్ లోని విజువల్స్ కొన్ని రిపీట్ అయినప్పటికీ పాట మాత్రం ఆహ్లాదకరంగా ఉంది. చరణ్ కుటుంబం నేపథ్యంలో పాట వస్తుంది కాబట్టి లీడ్ యాక్టర్స్ అందరూ ఇందులో ఉన్నారు. జీన్స్ ప్రశాంత్-ఆర్యన్ రాజేష్-రవి వర్మ-మధునందన్ ఇలా నలుగురు అన్నయ్యలు వాళ్ళ భార్యా పిల్లలు ఇలా మొత్తం సరదాగా సంతోషంగా గడిచిపోతున్నట్టు చూపించేశారు. దేవిశ్రీప్రసాద్ ట్యూన్ రెగ్యులర్ గా ఉన్నా పిక్చరైజేషన్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది.
ఇంత మాస్ మసాలా సినిమాలో ఇలాంటి కూల్ నెంబర్ ఉండటం ఆశ్చర్యకరంగా ఉన్నా కథ డిమాండ్ మేరకు పెట్టినట్టు కనిపిస్తోంది. నలుగురు అన్నయ్యలను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తమ్ముడు ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉండే విలన్ వివేక్ ఒబేరాయ్ తో ఎందుకు శత్రుత్వం వచ్చింది భీకరమైన పోరాటాలకు ఎందుకు తలపడాల్సి వచ్చింది అనేది తెరమీద చూడాల్సిందే. జనవరి 11న విడుదల కానున్న వినయ విధేయ రామ తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ బిజినెస్ పరంగా విపరీతమైన క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ కోసం రెడీ అవుతోంది. కియారా అద్వానీ చరణ్ కు జోడిగా నటిస్తున్న ఈ మూవీ రంగస్థలంని మించే ఫస్ట్ డే కలెక్షన్ ఆశిస్తోంది ట్రేడ్.