Begin typing your search above and press return to search.

తనీ ఒరువన్ 2 లేటెస్ట్ అప్ డేట్ - స్క్రిప్టు సిద్ధమే.. కానీ!

By:  Tupaki Desk   |   20 Jan 2023 10:30 AM GMT
తనీ ఒరువన్ 2 లేటెస్ట్ అప్ డేట్ - స్క్రిప్టు సిద్ధమే.. కానీ!
X
డైరెక్టర్ మోహన్ రాజా.. ఈ పేరు వింటే చాలా మందికి ఒకప్పుడు రిమేక్ సినిమాలే గుర్తుకు వచ్చేవి. కానీ తన సొంత కథతో తన తమ్ముడు జయం రవితో తీసిన తనీ ఒరువన్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచి.. తనకు దర్శకుడిగా అసలైన గుర్తింపు తెచ్చింది. 2015లో వచ్చిన ఈ సినిమా డైరెక్టర్ గా మోహన్ రాజాకు చాలా మంచి పేరునే తీసుకొచ్చింది. అయితే ఆ తర్వాత నుంచి తనీ ఒరువన్ 2 తీయాలని మోహన్ రాజా భావిస్తున్నారట. కానీ పలు కారణాల వల్ల ఆ సినిమా ఆలోచన మానుకున్నారు.

కానీ తాజాగా హీరో జయం రవి తనీ ఒరువన్ 2 గురించి ఓ అప్ డేట్ ఇచ్చారు. త్వరలోనే తనీ ఒరువన్ 2 తీయబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతే కాదండోయ్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు ఇప్పటికే పూర్తయి రెడీగా ఉందని జయం రవి చెప్పుకొచ్చారు.

కానీ ప్రస్తుతం తనతో పాటు తన అన్నయ్య మోహన్ రాజా వేరే సినిమాలు, ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో సినిమాను ప్రారంభించలేదని వివరించారు. అవి పూర్తయిన వెంటనే తనీ ఒరువన్ 2 సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని అన్నారు.

అయితే తనీ ఒరువన్ 2.. పొన్నియన్ సెల్వన్ సినిమాకు ముందుగానే చేయాల్సి ఉండగా.. ఆ సినిమాను వదులుకోలేక ఈ సినిమాను ఆపినట్లు చెప్పారు. ఏది ఏమైతేనేం.. ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన తనీ ఒరువన్ సినిమాకి సీక్వెల్ సినిమా రావడం చాలా మందిలో ఆసక్తిని కల్గిస్తోంది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా ప్రారంభం అవుతుందా అని అభిమానులు వేచి చూస్తున్నారు.

అయితే తనీ ఒరువన్ సినిమాకు రంగం ఫేమ్ కేవీ ఆనంద్ సినిమాలకు రచయితలుగా పని చేసే రచయితల ద్వయం శుభ(కలం పేరు).. స్క్రీన్ ప్లే సహకారం అందించారు. అయితే ఈ సినిమా ప్రారంభించినప్పుడు ఎలాంటి అంచనాలు లేవట.

అదీకాకుండా రవికి అప్పటికే వరుస ప్లాపులు రావడం, బడ్జెట్ సమస్యలు కూడా రావడంతో చాలా మంది ఆశలు వదిలేసుకున్నారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో తనీ ఒరువన్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచి.. డైరెక్టర్ గా మోహన్ రాజాకు, హీరోగా జయం రవికి మంచి పేరు తీసుకొచ్చింది. మరీ తనీ ఒరువన్ 2 ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.